23న బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:02 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది.
విశాఖపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని అంచనావేశారు. కాగా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది.
పొగమంచు
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నవంబర్ 18వ తేదీ ఉదయం బీహార్‌లో పొగమంచు పడుతుందని తెలిపింది. అదే విధంగా నవంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాంతోపాటు మేఘాలయలోని వివిధ ప్రాంతాలలో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఢిల్లీలో ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. న్యూఢిల్లీలో .. ఎన్సీఆర్లో చలి విజృంభించింది. దీంతో ఢిల్లీ వాసులకు ఉదయం, సాయంత్రం వేళల్లో చలి మొదలైంది. అలాగే శీతాకాలం కావడంతో భారీగా మంచు పడుతుంది. ఉదయం పూటి దట్టమైన పొగ మంచు సైతం కప్పేస్తుంది.
For National News And Telugu News