Share News

Minister Atchannaidu: పశు పోషకులకు శుభవార్త చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 08:28 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Minister Atchannaidu: పశు పోషకులకు శుభవార్త చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 90శాతం రాయితీపై పశువుల షెడ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెల్టర్ల నిర్మాణానికి రాయితీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్న వెల్లడించారు.


పశు పోషకులకు అందించే లబ్ధి ఇదే..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశు పోషకులకు 90శాతం రాయితీపై ఒక్కో షెడ్డుకు గరిష్ఠంగా రూ.2.30లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70శాతం రాయితీపై గరిష్ఠంగా యూనిట్‌కు రూ.2.30లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అలాగే కోళ్ల పెంపకందారుల కోసం ఒక్కో షెడ్డు నిర్మాణానికి 70శాతం రాయితీపై గరిష్ఠంగా యూనిట్‌కు రూ.1.32లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో అన్నీ జిల్లాల్లో ఈ పథకం అమలు కానున్నట్లు మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

Minister Dola: ఆ అధికారులపై మంత్రి డోలా ఆగ్రహం..

Updated Date - Jul 13 , 2024 | 08:30 PM