Share News

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

ABN , Publish Date - Aug 13 , 2024 | 12:13 PM

పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం రేగింది. మాచర్లకు చెందిన రాజేష్ అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్పీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమతో రాజేష్‌కు గత కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజేష్‌పై పూర్ణిమ నిన్న (సోమవారం) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Selfie Video: పల్నాడు జిల్లా: మాచర్లలో సెల్ఫీ వీడియో కలకలం..

పల్నాడు జిల్లా: మాచర్లలో (Macharla) సెల్ఫీ వీడియో (Selfie Video) కలకలం (Hulchul) రేగింది. మాచర్లకు చెందిన రాజేష్ (Rajesh) అనే వ్యక్తి తాను చనిపోతున్నట్లు సెల్పీ వీడియో (Selfie Video) తీసుకుని అదృశ్యమయ్యాడు. భార్య పూర్ణిమ (Purnima)తో రాజేష్‌కు గత కొద్దికాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేష్‌పై పూర్ణిమ నిన్న (సోమవారం) పోలీస్ స్టేషన్‌‌లో (Police Station) ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రాజేష్ అదృశ్యమైన అనంతరం లింగాపురం కాలనీ సాగర్ కుడి కాలువ (Sagar right canal) వద్ద రాజేష్ బైక్‌ను గుర్తించారు. సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.


రాజేష్ ఆవేదన పూరితంగా చేసిన ఈ సెల్పీ వీడియో అందరినీ కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంది. తన కుటుంబసభ్యులు, బంధువుల నుంచి తాను ఏ విధంగా మోసపోయింది.. వేధింపులకు గురైన విషయం స్పష్టంగా తన సెల్ఫీ వీడియోలో వివరించారు. తాను ఇక బతకలేనని, జీవితాన్ని ముగిస్తున్నానని తనను క్షమించాలంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

తన తండ్రికి అండగా ఉండాలంటూ తన బావ, స్నేహితులను కోరారు. అలాగే తన మృతదేహానికి తెలుగుదేశం జెండా కప్పి అంత్యక్రియలు చేయాలని కోరారు. ఇదే తన చివరి కోరికని రాజేష్ అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సాగర్ కుడి కాలువ వద్దకు చేరుకుని రాజేష్ మృత దేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడలో 'తంగలాన్' మూవీ టీమ్‌ సందడి..

దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు

వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...

గ్రేటర్‌లో అవినీతి జలగలు..

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 13 , 2024 | 12:30 PM