Share News

AP Election 2024: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

ABN , Publish Date - May 14 , 2024 | 12:03 PM

నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్‌లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.

AP Election 2024: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత
High tension in palnadu

పల్నాడు జిల్లా: నరసరావుపేట (Narasaraopet)లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ (Polling) సందర్భంగా వైసీపీ నేతలు (YCP Leaders) దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్‌ (Mallamma Center)లో టీడీపీ (TDP) నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు. పోలింగ్ సందర్భంగా సోమవారం ఉదయం నుంచి హింసాత్మక ఘటనల నేపథ్యంలో నరసరావుపేట ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు (Chadalavada Aravinda Babu) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasa Reddy) ఇంటివైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 01:32 PM