Share News

AP Politics: అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వైసీపీ వ్యూహంలో భాగమా.. అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్నారా..!

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:00 AM

ప్రజల సమస్యలను చర్చించి.. పరిష్కారా మార్గాలు కనుక్కోవడం, ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఉపసంహరించుకుని.. రాష్ట్రం, దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునే వేదికలు చట్టసభలు.

AP Politics: అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వైసీపీ వ్యూహంలో భాగమా.. అందివచ్చిన  అవకాశాన్ని వదులుకున్నారా..!
YSRCP MLA's

ప్రజల సమస్యలను చర్చించి.. పరిష్కారా మార్గాలు కనుక్కోవడం, ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఉపసంహరించుకుని.. రాష్ట్రం, దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునే వేదికలు చట్టసభలు.. ప్రజలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుని తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తారు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విపక్షాలకు అసెంబ్లీ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రాష్ట్రం మొత్తం అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోంది.. తమ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారనేది ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఇటీవల కాలంలో అసెంబ్లీలో ప్రజాసమస్యల కంటే ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకుని.. తమ రాజకీయ ప్రత్యర్థులను తిట్టడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనిపించింది. విపక్షాలను గౌరవించకపోవడం, ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేయడం వంటి సందర్భాలు గతంలో ఏపీ అసెంబ్లీలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అధికారపక్షానికి మినహిస్తే ఏ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో విపక్షాల పాత్ర ఎంతో ప్రముఖమైనది. దీంతో విపక్షాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకపోయినా.. వైసీపీ అధినేత జగన్‌ను గౌరవించాలని.. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలను సభలో అవమానించవద్దని సీఎం చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు కనిపించారు. తరువాత సభకు హాజరుకాలేదు.

వ్యవస్థలను కుప్పకూల్చారు!


వ్యూహంలో భాగమా..

ఈనెల 22న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా..మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రెండో రోజు, మూడో రోజు ఏపీ అసెంబ్లీలో రెండు విలువైన బిల్లులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో ధర్నాకు వెళ్లారు. ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, నిరసన రూపంలో తెలియజేయాలంటే అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవచ్చు. సమావేశాలకు హాజరై ఏదైనా ఒక అంశంపై తాము నిరసన తెలుపుతున్నామని స్పీకర్‌కు తెలియజేసి సభ నుంచి వాకౌట్ చేయ్యొచ్చు. ఇది సభ రికార్డుల్లో నమోదవుతుంది. అలా కాకుండా అందివచ్చిన అవకాశాన్ని వదులుకుని జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి,భద్రతలపై చర్చించాలని వైసీపీ సభలో స్పీకర్‌ను కోరవచ్చు. వివిధ మార్గాల ద్వారా తమకు ఉన్న హక్కులను ఉపయోగించుకుని సభ ముందుకు ఆ విషయాన్ని తీసుకురావచ్చు. ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత శాఖ మంత్రులను అడగవచ్చు. కానీ అసెంబ్లీలో చర్చించకుండా జగన్ సమావేశాలకు దూరంగా ఉండటం వెనుక ఏదైనా వ్యూహం ఉండి ఉండొచ్చని.. వైసీపీ పరువుపోకుండా చూసుకునేందుకే జగన్ ఇలా చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది.

Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం


తప్పించుకున్నారా..

ఏపీ శాసనసభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులపై చర్చ జరిగింది. అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అదే సమయంలో వైసీపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను సమర్థించుకుంది. శాసనసభలో వైసీపీ తన వాదనను వినిపించడానికి వచ్చిన అవకాశాన్ని ఓ విధంగా జారవిడుచుకున్నట్లైంది. వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ రద్దును సమర్థిస్తున్నారో.. వ్యతిరేకిస్తున్నారో తెలియజేయాల్సి ఉండేది. ఈ చట్టంపై మాట్లాడటం ఇష్టం లేకనే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా పేరుతో సమావేశాలకు దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.

ఢిల్లీ వీధుల్లో జగన్‌ ధర్నా


హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. కొన్ని ప్రసిద్ధ సంస్థలకు ప్రముఖమైన వ్యక్తుల పేర్లు పెట్టినప్పుడు.. ప్రభుత్వాలు మారగానే ఆ పేర్లను వెంటనే మార్చే సంస్కృతి గతంలో లేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్పులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంది. వాస్తవానికి తెలుగుజాతి గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా పార్టీలు, కుల, మతాలకు అతీతంగా దివంగత నందమూరి తారకరామారావును భావిస్తారు. అలాంటి వ్యక్తిని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. 2019కి ముందు వర్సిటీకి ఉన్న పేరును పునరుద్దరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సభకు హాజరైతే పేరును ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఎన్డీఆర్ పేరు పెట్టడాన్ని సమర్థిస్తున్నారో.. వ్యతిరేకిస్తున్నారో వైసీపీ చెప్పాల్సి ఉండేది. కీలకమైన బిల్లులపై అభిప్రాయం చెప్పలేని పరిస్థితుల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారా అనే చర్చ జరుగుతోంది.


పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra pradesh News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 08:00 AM