Share News

YS Sharmila: ‘జలయజ్ఞం కోసమే జన్మించానని నాన్న అనేవారు’

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:20 PM

వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు, ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనపడేదని ఆయన కూతురు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయ పడ్డారు. వైఎస్ఆర్ ఏం చేయాలన్నా దైర్యంగా చేసేవారని గుర్తుచేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నను కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను.

YS Sharmila: ‘జలయజ్ఞం కోసమే జన్మించానని నాన్న అనేవారు’
ys sharmila

అమరావతి: వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునువ్వు, ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనపడేదని ఆయన కూతురు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అభిప్రాయ పడ్డారు. వైఎస్ఆర్ ఏం చేయాలన్నా దైర్యంగా చేసేవారని గుర్తుచేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నను కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను. అమరావతిలో జరిగిన వైయస్ జయంతి సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు.


అందుకే ఈ జన్మ అనేవారు

‘జలయజ్ఞం కోసమే తనకు దేవుడు జన్మ ఇచ్చాడని నాన్న విశ్వసించేవారు. ఆరోగ్య శ్రీ, ఇతర పథకాలు కన్నా జలయజ్ఞం మంచి పేరు తీసుకొచ్చింది. జలయజ్ఞం ద్వారా నీరు ఇవ్వాలని నాన్న తపన పడ్డారు. అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉండాలని చెప్పేవారు. రెండోసారి గెలిచిన తర్వాత వెంటనే ప్రజల్లో ఉండాలని అనుకున్నారు. అమలు చేసే పథకాలన్నీ అందాలని ఆరాట పడేవారు. ప్రజల కోసం రచ్చబండ పేరుతో బయల్దేరి శాశ్వతంగా దూరం అయ్యారు. భూతద్దం పెట్టి వెతికినా ఆయన లాంటి వ్యక్తి కనిపించరు. 2009లో ఆశించిన మెజార్టీ రాలేదు కదా అని నేను అడిగాను. ఆ సమయంలో నవ్వి ఊరుకున్నారే తప్ప.. ఏమీ చెప్పలేదు. ఆ ఎన్నికల ఫలితాల సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డారు. నాన్న చనిపోయిన తర్వాత ప్రజల స్పందన చూశాక అర్దమైంది. వారి గుండెల్లో నాన్న ఉన్నారు అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.


Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం

‘కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో నాన్న పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో దేశాభివృద్ది సాధ్యం అని ప్రగాఢంగా విశ్వసించేవారు. మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని చెప్పేవారు. బీజేపీకి బద్ద వ్యతిరేకిగా ఉండేవారు. కానీ ఇప్పుడు వైఎస్ ఆశయాలు నిలబెట్టుకుంటానని చెప్పేవారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారు. అలాంటి వారు వైఎస్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళతారు. తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని నాన్న బలంగా కోరుకునేవారు. నాన్న సంకల్పం కోసం పని చేస్తాను అని’ వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.


Read Latest
AP News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 08:20 PM