Share News

AB Venkateswara Rao: ఒక కేసు తేలితే.. మరో కేసు పెట్టారు.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:24 AM

వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెతకాలని... అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానని తెలిపారు. ఆ రోజు పూర్తి ఆధారాలు సేకరించలేదని పేర్కొన్నారు.

AB Venkateswara Rao: ఒక కేసు తేలితే.. మరో కేసు పెట్టారు.. ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం
AB Venkateswara Rao

విజయవాడ: వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ తర్వాత ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైఎస్ వివేకానంద హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెతకాలని, అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానన్నారు. ఆ రోజు పూర్తి ఆధారాలు సేకరించ లేదన్నారు. తమ కింద పనిచేసే సిబ్బందికి సూచనలు చేయడం సహజ ప్రక్రియ అని.. ఇప్పటికీ ఆ కేసు విచారణ కోర్టులో నడుస్తోందని వివరించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదన్నారు. అది రాజకీయ కోణంలో జరిగిన ప్రక్రియ అని... తనకేంటి సంబంధమని ప్రశ్నించారు.

AP News: చిలకలూరిపేట మండలంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..


లక్షల మంది అండగా నిలిచారు..

పార్టీ మార్పు పై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా ఆ సమయంలో స్పందించారని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. వివిధ కారణాలతో వస్తే తాను ఎలా తీసుకొచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారు. ఎవరో ఒకరిని బకరా చేయాలని తనపై నింద వేశారని తెలిపారు. 2019 తరువాత పరిపాలన విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని తెలిపారు. తన‌ విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తన తప్పు ఉంటే సారీ చెప్పూవాడినన్నారు. చేయని తప్పుకు పోరాటం చేయాలని భావించానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికీ న్యాయస్థానంలో తన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. ఈ పోరాటంలో తనకు లక్షల మంది మానసికంగా అండగా నిలిచారన్నారు. వారు ఇచ్చిన ధైర్యం తనలో మనోస్థైర్యం నింపిందన్నారు.

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే


నాపై ఆరోపణలు చేస్తారు..

‘‘నాలో మరింత పోరాట పటిమ పెరిగింది. నాలాంటోళ్లు కూడా జరిగిన తప్పులపై పోరాటం చేయకపోతే ఎవరు ముందుకు వస్తారు? నాకు ఎదురైన ఇబ్బందులు తప్పక పోరాటం చేయాల్సి వచ్చింది. ఇంత కాలం నాకు జరిగిన అన్యాయంపై న్యాయం కావాలని పోరాడుతూనే ఉన్నా. పరిపాలన వ్యవస్థలో అనేక రూల్స్ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఆరోపణలు చేసి విచారణ పేరుతో కాలయాపన చేశారు. ఆ సమయంలో నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక కేసు తేలాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒక కేసు తేలితే... వెంటనే మరో కేసు పెట్టి విచారణ అంటారు. ఊరు పేరు లేని‌వాడు... రెండో శనివారం నా మీద ఆరోపణలు చేస్తారు. అర్ధరాత్రి సీఎం పేషి నుంచి వదులుతారు... పేపర్‌లో పబ్లిష్ చేస్తారు. ఎలాంటి ఆధారం లేని వాటికి నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఆరు పేజీలు సర్క్యూలెట్ చేసిన వారు విచారణకు రారు. పరిపాలన యంత్రాంగం వారిని నడిపేవారిని బట్టి పని చేస్తుంది అని’ ఏబీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు.

మాకు మీరు.. మీకు మేము!


మంచివారు అయితే ఒకలా. చెడ్డ వారు అయితే మరో విధంగా ఉంటుంది. మా డిపార్ట్ మెంట్‌లో కొంతమంది అబద్దాలు చెప్పి ఉండవచ్చు. అదే వాస్తవం అనుకుని నన్ను టార్గెట్ చేసి కేసులు పెట్టారు. నాయకుడు అనే వాళ్లకి నిజ నిజాలు విశ్లేషణ చేసుకునే గుణం ఉండాలి. అసలు నేను ఏం తప్పు చేశానో, మీ అధినేతను అడిగి చెప్పండని వైసీపీ నేతకి చెప్పా. ఆ నాయకుడు ఆ అంశం అక్కడ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అనుకోని‌ సవాళ్లు ఎదురవుతాయి. అనూహ్యంగా మలుపులు తిరిగినా నేను ఎదుర్కొన్నాను. ఈ ఐదేళ్లు అన్యాయం జరిగింది. సమాజం హితం‌ కోసం నా పని నేను చేస్తా. నా శేష జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తా... ప్రజలు, సమాజం కోసం స్పందిస్తూ ఉంటా’’ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 04:10 PM