Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:37 PM

ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
పీలేరులో పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, సెప్టెంబరు 3: ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత సమస్యల కంటే సామాజిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వాటి పరిష్కా రానికి అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. అధికారం లోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నందున పార్టీ శ్రేణులు బాధ్యతగా మెలుగుతూ ప్రజల మన్ననలు చూరగొనేందుకు కృషి చేయాలన్నారు. అనం తరం ఆయన పంచాయతీ కార్యదర్శి గురుమోహన, విద్యుత శాఖాధి కారులు, పలు హాస్టళ్ల వార్డెనలతో ప్రత్యేకంగా సమావేశమై, ఆయా శాఖల్లో సమస్యలపై వాకబు చేశారు. అంతకుమునుపు ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న పార్టీ నేతలు జ్ఞానమూర్తి, జీవీ రవికుమార్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత రెడ్డి, లడ్డూ జాఫర్‌, అమరనాథరెడ్డి, నారే సతీశ, పురం రామ్మూర్తి, లక్ష్మీకర, పోలిశెట్టి సురేంద్ర, శ్రీనాథరెడ్డి, స్పోర్ట్స్‌ మల్లి, గాండ్ల విజయ కుమార్‌, ముబారక్‌, హేమచంద్రారెడ్డి, సాధన, పురం రెడ్డమ్మ, రెడ్డిరాణి, స్వర్ణ, షమ, రమాదేవి, సోనాబాయి, వసంతాల రాజా, ఎస్‌ఎంసీ చైర్మన ఆంజి, గుర్రం నరేశ, ఖాదర్‌, శివ, షౌకత అలీ, ఖాజా, చానబాషా, సహదేవ, జనసేన నాయకులు కలప రవి, మోహనకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి

పీలేరు పట్టణంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలంటూ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ, ఎన్టీఆర్‌ కళాక్షేత్రం సభ్యుడు ఎన్టీఆర్‌ నఫీస్‌ ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతి కీర్తిని నేల నాలుగు వైపులా వ్యాపింపజేసిన ఎన్టీఆర్‌ విగ్రహం పీలేరు పట్టణంలో స్థాపించడం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నఫీస్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎటువంటి వివాదం లేని స్థలం ఎంపిక చేసి త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ మహమ్మద్‌ పీర్‌, టీడీపీ నేతలు ఫర్హత, ఇర్షాద్‌, సలీం, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి ఐదుగురు వైసీపీ ఎంపీటీసీల మద్దతు

కలికిరి: కలికిరి మండలంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి మద్దతు పలికారు. మంగళవారం ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డిని ఆయన ఇంటి వద్ద కలిసి మండలంలో అభివృద్ధి కోసం టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరంతా కిశోర్‌కుమార్‌ రెడ్డికి శాలువాలు కప్పి సన్మానించారు. ఇలా టీడీపీకి మద్దతు తెలిపిన వారిలో కలికిరి-2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి, కలికిరి-3, భోగేష్‌, కలికిరి-4 రంజిత, మునేళ్ళపల్లె ఎంపీటీసీ సభ్యురాలు షాహీనా, పల్లవోలు ఎంపీటీసీ పి.రమణప్రదీప్‌ రెడ్డి ఉన్నారు. మండలంలోని టీడీపీ నాయకులతో కలిసి పని చేయాలని ఈ సందర్భంగా కిశోర్‌కుమార్‌ రెడ్డి సూచించారు. ఎంపీటీసీలకు అవసరమైన సహకారం తన వద్ద నుంచి అందుతుందని హామీ ఇచ్చారు. కాగా మండలంలో కోఆప్షన సభ్యుడితో కలిపి 14 మంది సభ్యులున్నారు. కలికిరి-5 ఎంపీటీసీ రెడ్డివారి గాయత్రి, పత్తేగడ కృష్ణప్ఫ, మర్రికుంటపల్లె చిరంజీవమ్మ ఇప్పటికే టీడీపీ సభ్యులుగా వున్నారు. వైసీపీ సభ్యుల చేరికతో టీడీపీ బలం 8కి పెరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డివారి యోగేష్‌ రెడ్డి, సతీష్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

పరామర్శ

కలికిరి ఇందిరమ్మ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు జ్ఞానమూర్తిని మంగళవారం ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న జ్ఞానమూర్తి ఇంటి కి వెళ్ళి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకో వాలని ఆకాంక్షించారు. మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, యోగేష్‌ రెడ్డి, సతీష్‌కుమార్‌ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, సనావుల్లా, పెద్ద చంద్ర, యల్లయ్య, రాజా, తదితరులున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:37 PM