Share News

నీటి కోసం ముందు చూపు

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:27 PM

నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.

నీటి కోసం ముందు చూపు
ఫరైతుల చొరవతో నిండుకుండలా సందూరు చెరువు ఫసత్ఫలితాలు పొందుతున్న ఆయకట్టుదారులు

రైతుల చొరవతో నిండుకుండలా సందూరు చెరువు సత్ఫలితాలు పొందుతున్న ఆయకట్టుదారులు

రామసముద్రం, సెప్టెంబరు 14: నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది. అందుకే ఎక్కడైనా చెరువులు ఆక్రమణలకు గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామసముద్రం మండలంలో చెరువు నీటిని నిల్వచేసి పంటల తోపా టు తాగునీటికి ఇక్కట్లు లేకుండా చేసుకోవడం ఇక్కడి రైతుల ముం దు చూపును అభినందించాల్సిందే. రామసముద్రం మండలంలో 208 చెరువులు ఉన్నాయి. వాటి కింద సుమారు 4662 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. మండలంలోని చెరువులలో సీతరగానిపల్లె సమీపం లోని అగ్రహారం చెరువు అత్యంత పెద్ద చెరువు కాగా చెంబకూరు సమీపంలోని కదిరాయచెరువు, మట్లవారిపల్లె సమీపంలోని సందూరు చెరువు, గొల్లపల్లె చెరువు, ఊలపాడు చెరువులు పెద్ద చెరువులుగా ఉన్నాయి. కాగా సాగునీటిని నిల్వచేసి, భూగర్భ జలాలు వృద్ది చెందే లా చేసుకుని నీటిని భవిష్యత అవసరాలకు వినియోగించుకు నేలా తమ గ్రామ పరిధిలోని చెరువును రైతులు అందరూ ఉమ్మడిగా నిర్ణ యం తీసుకుని చెరువు తూములను సీజ్‌చేసి నీటిని బయటకు వెళ్లిపోకుండా అడ్డుకోవడంతో సత్ఫలితాలు పొందుతున్నారు. రామ సముద్రం మండలంలోని పెద్దకురప్పల్లె పంచాయతీలోని మట్ల వారి పల్లె సమీపంలో సందూరు చెరువు దాదాపు 64ఎకరాలల్లో విస్తరిం చింది. పెద్దకుప్పల్లె, తిరుమలరెడ్డిపల్లె, కుర్రప్పల్లె, నారేపల్లె, మానేవా రిపల్లె, దండోలూరు గ్రామాలకు చెందిన రైతులకు ఈ చెరువు కింద సుమారు 150 ఎకరాలు సాగు భూమి ఉంది. ఈ చెరువుకు పక్కలో నే కొన్నివేల ఎకరాల విస్తీర్ణంలో అడ్డకొండ అటవీ ప్రాంతం ఉండడం తో చిన్నపాటి వర్షం కురిసినా కొండ ప్రాంతం నుంచి నీరు చెరువుకు చేరుతుంది. దీంతో ఈ చెరువు ప్రతి ఏడూ నిండుకుండలా ఉండేది. ఈ చెరువు ఆయకట్టు కింద 150 ఎకరాలలో రైతులు ప్రతి ఏటా వర్షాకాలంలో వరిుతోపాటు వేసవి కాలంలో బోరుబావుల సాయంతో పంటలు సాగు చేసేవారు. ఈనేపథ్యంలో 2012 నుంచి 2014 వరకు వర్షాలు సరిగా పడకపోవడంతో ఈ చెరువు కింద పంటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. బోరుబావులలో కూడా నీటి మట్టం తగ్గిపోయి బోర్లు సైతం ఎండిపోయాయి. రైతులు అందరూ కలిసి చెరువు నీటిని వాడుకోకుండా 2015లో చెరువులో చేరిన నీటిని తూముల ద్వారా బయటకు వెళ్లకుండా బ్లాక్‌చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరగ డంతోపాటు ఇప్పటి వరకు చెరువు నీటితో కళకళలాడుతోంది. బోర్లలో కూడా నీటిమట్టం పెరిగి ఏడాదిపాటు పంటలు సాగు చేస్తున్నారు.

పంచాయతీకి లక్షల్లో ఆదాయం

సందూరు చెరువు సీజ్‌ వల్ల చెరువులో ఎప్పు డూ నీళ్లు ఉండ డంతో పంచాయతీ తరపున చేపల పెంపకం చేపట్టాం. ప్రతి ఏడూ చెరువు లో చేపల వేలం వల్ల లక్షల్లో ఆదాయం వస్తోం ది. ఈ నిధులతో గ్రామాల్లో వివిధ అబివృద్ధి కార్యక్రమాలు చేపడుతు న్నాం.

-రెడ్డెప్పనాయుడు, గ్రామ సర్పంచ

గ్రామస్థుల ముందుచూపు సత్ఫలితాలిస్తోంది

భవిష్యత్తులో తాగు, సాగు నీటి కొరత రా కుండా గ్రామస్థుల ముందుచూపుతో చెరువు సీజ్‌ చేయడం సత్ఫలితాలు ఇస్తోంది. అప్పుడు సర్పంచగా ఉన్న నాకు రైతుల నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గత ఏడేళ్లుగా సం దూరు చెరువు నీటితో కళకళలాడుతోంది.

-రెడ్డిశేఖర్‌, మాజీ సర్పంచ

ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేస్తున్నాను

నాకు ఈ చెరువు కింద రెండు ఎకరాల భూమి ఉంది. చెరువు సీజ్‌ చేయక ముందు చెరువు నీటిని వాడడం వల్ల ఏడాదికి ఒకసారి వరిసాగుచేసేవారం. కానీ ఇప్పుడు నీటిని చెరువులో నిలపడం వల్ల బోరు బావుల్లో నీటి మట్టం పెరిగి ఏడాదికి రెండు పంటలకు నీరు పుష్కలంగా అవుతున్నాయి.

-మంజునాథ్‌, రైతు

Updated Date - Sep 14 , 2024 | 11:27 PM