Share News

Kollu Ravindra: మట్టి దోపిడి కారణంగానే ఈ నష్టం

ABN , Publish Date - Sep 08 , 2024 | 09:17 PM

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకు వరద పోటు వచ్చిందనీ ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయని చెప్పారు.

Kollu Ravindra: మట్టి దోపిడి కారణంగానే ఈ నష్టం

అమరావతి, సెప్టెంబర్ 08: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుకు వరద పోటు వచ్చిందనీ ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అతలాకుతలమైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలోని ఆ పార్టీ నేతల ఆక్రమణలు, మట్టి దోపిడీ కారణంగానే ఈ నష్టం చోటు చేసుకుందన్నారు. బుడమేరు వాగు గట్లను గత ప్రభుత్వంలోని వారు బలహీనపరిచారని ఆరోపించారు.

Also Read: Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..


ఇటువంటి విపత్తుల వేళ ప్రజల వద్దకు వచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి.....ఈ తరహా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ వైసీపీ నేతలకు చరకలంటించారు. గుడివాడ నియోజకవర్గంలోని వరద నీటి ముంపు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతోపాటు స్థానిక లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటిచారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన వారిందరిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:AP Rains: భారీ వర్షాలు.. అప్రమత్తమైన అనకాపల్లి జిల్లా యంత్రాంగం


ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకు రావడానికి గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటువంటి విపత్తు చోటు చేసుకున్న వేళ.. కూటమి నేతల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విధంగా సేవలు అందించడం నిజంగా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ..

నందివాడ మండలంలో ప్రతి ఊరు ముంపు బారిన పడి నష్ట పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు రోజులుగా ముంపులోనే ఇళ్లు, పొలాలు ఉన్నాయన్నారు. 12వేల మందికిపైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్నారని తెలిపారు. ఇంకెన్ని రోజులు ఈ వరద కష్టాల్లో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో వరద నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: AP Rains: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలొస్తున్న దాతలు

Also Read: Kolkata: ఈడీ తనిఖీలు.. రూ. 6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత


బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందిస్తూ..

ఎప్పుడు లేని దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం చూస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు నాబార్డు నిధులతో బుడమేరు వాగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుక చర్యలు తీసుకుంటామన్నారు. పంట, ఆస్తి నష్టం జరిగినా ప్రతి ఒక్కరికి మెరుగైన నష్ట పరిహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 09:17 PM