Share News

Andhra Pradesh: ఏపీ సీఎంఓలో కీలక పరిణామం.. ఆ ముగ్గురిపై వేటు..

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం(Andhra Pradesh Government) మారింది.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజీషన్‌లో ఉండి.. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy) సెలవులపై వెళ్లిపోగా..

Andhra Pradesh: ఏపీ సీఎంఓలో కీలక పరిణామం.. ఆ ముగ్గురిపై వేటు..
Andhra Pradesh

అమరావతి, జూన్ 07: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం(Andhra Pradesh Government) మారింది.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజీషన్‌లో ఉండి.. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy) సెలవులపై వెళ్లిపోగా.. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం అయ్యారు. ఇప్పుడు మరికొందరు ఉన్నతాధికారులపై వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన అధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ పేషీలో ఉన్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను జీఏడీలో రిపోర్ట్ చేయాలని నూతన సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పేషీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ భరత్ గుప్తాలను బదిలీ చేసింది ప్రభుత్వం. వీరంతా జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు.


కొత్త టీమ్ కోసం కసరత్తు..

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముందే సీఎంఓలో కొత్త టీమ్ కోసం కసరత్తు నడుస్తోంది. జగన్ పేషీలో ఉన్న వారిని తొలగించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశం ఉందని సమాచారం. అలాగే మరికొందరు కీలక అధికారులకు సీఎంఓలో ప్రధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తోంది.


నాడు కీలక శాఖలకు ముఖ్యకార్యదర్శి.. నేడు ప్రధాన కార్యదర్శి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి సెలవులపై వెళ్లడంతో ఆయన స్థానంలో సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్‌ నియామకం అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేస్తకున్నారు. ఇప్పుడు జవహార్ రెడ్డి స్థానంలో నీరభ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించారు. అయితే, గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నీరభ్ కుమార్ కీలక శాఖకు ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. ఇక జవహార్ రెడ్డిని కూడా బదిలీ చేసింది ప్రభుత్వం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 07 , 2024 | 03:51 PM