Share News

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 07:57 AM

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!
CM Chandrababu Naidu

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. సమావేశానికి టీడీపీ (TDP) ఎంపీలు, కేంద్రమంత్రులు హాజరవుతారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడం, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీ కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఎంపీలు ఢిల్లీలో ఉంటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు పార్లమెంట్ సభ్యులకు సూచించారు. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడటంతో.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కీలక అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయడంతో పాటు.. ప్రాధాన్యత క్రమాలను వివరించనున్నారు.
పేదల జీవితాలు మార్చాలి


బడ్జెట్ నేపథ్యంలో..

సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఎంతో కీలకం కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సరైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈసారి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో తెలుగుదేశం ఎంపీలు కీలకంగా మారడంతో.. ఏపీకి కొత్త ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఉండొచ్చనే అంచనాలో ఏపీ ప్రజలు ఉన్నారు. సాధారణంగా నిష్ఫత్తి ప్రకారం రాష్ట్రానికి వచ్చే నిధులతో పాటు.. రాజధాని నిర్మాణం, పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన సహాయానికి సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

‘పుంగనూరు’లో పెద్దిరెడ్డి సేవలో..


పక్కా ప్రణాళికతో..

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి కేంద్రమంత్రులను కలిశారు. ఎప్పటికప్పుడు హస్తినకు వెళ్లి కేంద్రమంత్రులతో సమావేశమై.. రాష్ట్రప్రయోజనాల దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తక్షణ అవసరాలకు సంబంధించి మంత్రిత్వశాఖలవారీ వినతి పత్రాలను చంద్రబాబు కేంద్రమంత్రులకు అందజేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ నిధులు, విభజన హామీల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


రాష్ట్రపతి పాలన విధించాలి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 20 , 2024 | 11:33 AM