Share News

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

ABN , Publish Date - Jun 25 , 2024 | 06:58 AM

అమరావతి: ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది.

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

అమరావతి: ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.


కాగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘థీమ్‌ ఆఫ్‌ కల్కి’ (Theme of Kalki) పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. నటి శోభనతోపాటు (Sobhana) పలువురు నృతకారిణిలు మథురలో నృత్య ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకోనే నటించగా అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్ దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Jun 25 , 2024 | 08:26 AM