Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం
ABN , Publish Date - Aug 02 , 2024 | 12:33 PM
Andhrapradesh: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్దమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని ఖాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్‌నుు పోలీసులు రికార్డ్ చేశారు.
కృష్ణా జిల్లా, ఆగస్టు 2: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram Former MLA Vallabhaneni Vamshi) అరెస్టుకు రంగం సిద్దమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు (AP Police) ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని ఖాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్‌నుు పోలీసులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు సమాచారం.
Supreme Court: ఎన్టీఏ లోపాల వల్లే లీకేజీ..!!
ఇప్పటికే వంశీ అరెస్ట్ చేసేందుకు మూడు స్పెషల్ టీమ్‌లను హైదరాబాద్ పంపినట్టు పోలీసులు చెబుతున్నారు.గన్నవరం నుంచి మూడు స్పెషల్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పాస్పోర్ట్, వీసా వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వంశీ, ఆయన అనుచరుల మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ కార్యాలయంపై..
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. ఐదు గంటలపాటు గన్నవరంలో వారు సృష్టించిన అరాచకం, విధ్వంసం స్థానికులను భయాందోళన లకు గురిచేశాయి. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకూ జీపులో వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు. కాగా.. దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Tirumala: జూలైలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ వివరాలు ఇవీ...
Read Latest AP News And Telugu News