Share News

YSRCP: ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్!

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:57 PM

Andhrapradesh: ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్‌లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు పార్టీకి టాటా చెప్పేసిన పరిస్థితి.

YSRCP: ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్!
Eluru YSRCP

అమరావతి, సెప్టెంబర్ 5: ఏపీలో వైసీపీకి (YSRCP) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్‌లోకి నెట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు పార్టీకి టాటా చెప్పేసిన పరిస్థితి. ఈక్రమంలో ఏలూరులో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. పార్టీ నేత గంటా ప్రసాద రావు (Ganta Prasad Rao) పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి


వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాదరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను గంటా ప్రసాద్ పంపించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన భార్య గంటా పద్మశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన గంటా ప్రసాదరావు టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.


కాగా... ఎన్నికల తర్వాత అనేక మంది నేతల పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆళ్ల నాని, మోపిదేవి, బీద మస్తాన్ ఇలా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. వైసీపీని వీడిన వారంతా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు కూడా. ఇటీవల సీనియర్ నేత, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి కూడా ఆళ్ల రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాని పంపారు.

TDP MLA: ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు.. 3 సార్లు లైంగిక దాడి చేశాడంటూ..


మరోవైపు మూడు రోజుల క్రితం ఏలూరులో వైసీపీ కార్పొరేటర్లు సైతం అధినేతకు షాకిచ్చారు. గత నెలలో దాదాపు 14 మంది వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, మహిళా కోఆప్షన్‌ సభ్యురాలు వైసీపీకి ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరంతా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అంతకు ముందే మేయర్ కొందరు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరిపోయారు. అయితే భారీ పరాజయం నుంచే ఇంకా కోలుకోని అధినేత జగన్‌ను... ఇలా పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వెళ్లిపోతుండటం మింగుపడని విషయంగా మారింది. మరి మిగిలిన నేతలైనా జగన్ ఏ రకంగా కాపాడుకుంటారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి...

Heavy Rains: మైలవరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

YSRCP: ఇప్పుడొస్తారా?... వైసీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 01:16 PM