Share News

CII: ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంది: సీఐఐ ఛైర్మన్ మురళి

ABN , Publish Date - Jul 23 , 2024 | 01:52 PM

విజయవాడ: 2024-25 కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉందని సీఐఐ ఛైర్మన్ మురళి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాజధాని అభివృద్దికి రూ. 15 వేల కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషమన్నారు.

CII: ఈ బడ్జెట్  చాలా ఉపయోగకరంగా ఉంది: సీఐఐ ఛైర్మన్ మురళి

విజయవాడ: 2024-25 కేంద్ర బడ్జెట్‌‌(Central Budget)లో ఏపీ (AP)పై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉందని సీఐఐ ఛైర్మన్ మురళి (CII Chairman Murali) అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) (CII) ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాజధాని అభివృద్దికి రూ. 15వేల కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లల్లో చూస్తే.. ఈ సారి బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. విభజన తర్వాత ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయోనని ఎదురు చూశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్చించుకున్నట్లు కనిపించిందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లు అర్దం అవుతోందన్నారు. ఈరోజు ప్రకటించిన బడ్జెట్ ఎపీకి చాలా మేలు చేస్తుందని తాము భావిస్తున్నామని, ప్రత్యేక హోదా లేదని చెప్పిన నేపధ్యంలో ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చిందన్నారు.


క్యాపిటల్ అమరావతి రాజధాని అభివృద్ది కోసం రూ.15వేల కోట్లు కేటాయింపు హర్షణీయమని.. పోలవరం ప్రాజెక్టు ఏపీకి చాలా కీలకమని.. పూర్తి బాధ్యత తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడం మనకు కలిసొచ్చే అంశమని సీఐఐ ఛైర్మన్ మురళి అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు కేటాయిస్తామని చెప్పారని, ఇండస్ట్రీయల్ కారిడార్ వెంటనే అభివృద్ది చేయడం ద్వారా పరిశ్రమలు వస్తాయని.. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆక్వా రంగంలో కొన్ని పన్నుల రాయతీ వల్ల పరిశ్రమ మరింత వృద్ది చెందుతుందని, స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగ అవకాశాలు, వంటి వాటిపైనా దేశ వ్యాప్తంగా కల్పించేలా బడ్జెట్‌లో ప్రస్తావించారని సంతోషం వ్యక్తం చేశారు.


సీఐఐ సభ్యులు (CII Members) మాట్లాడుతూ..

500 పరిశ్రమల ద్వారా కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారని, క్రెడిట్ గ్యారంటీ స్కీంపై ప్రస్తావించారని, ఐదు కోట్ల యూత్‌కు అడిషనల్ స్కిల్స్ కోసం శిక్షణ ఇవ్వనున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, అవకాశాలు, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ (MSME) ఇవాళ చాలా సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎగుమతులు చేసే క్వాలిటీతో మన ఉత్పత్తులు ఉండాలన్నారు. మన విద్యా విధానం అన్ని రంగాలకు కలిపి ఉంటుందని, కొన్ని దేశాలలో ప్రత్యేక విభాగాల వారీగా విద్యా వ్యవస్థ కొనసాగుతోందని, యువత రాణించాలంటే... ఈ నూతన విద్యా విధానం కొనసాగాల్సి ఉందన్నారు. రెండు, మూడు కోట్ల మందికి ఉద్యోగాలు అంటే.. మేజర్ ఛాలంజ్ అని వ్యాఖ్యానించారు. ఆ తరహాలో వనరులు సమకూర్చాలని.. పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రూరల్ ఏరియాలో ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలంటే.. వారికి షెల్డర్ కూడా చూపించాల్సి ఉందని, చిన్న తరహా పరిశ్రమల వృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సీఐఐ సభ్యులు పేర్కొన్నారు.


సీఐఐ నాగలక్ష్మి (CII Nagalakshmi) మాట్లాడుతూ..

మహిళలకు ఉపాధి మార్గాలు చూపించి ఆర్ధికంగా ఎదిగేలా చూస్తామని, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌పై స్టాంపు డ్యూటీ తగ్గిస్తామని హామీ ఇచ్చారని. మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. పన్నుల విషయంలో కూడా కొంతవరకు రాయతీ ఇచ్చారని, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రం కొద్దిగా పెంచారన్నారు. స్టాక్ మార్కెట్‌పై ఈ ప్రభావం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రూ. 3 లక్షల ఆదాయం వరకు ఎటువంటి ట్యాక్స్‌లు ఉండవని, రూ. 50 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారికి 30 శాతం ట్యాక్స్ కొనసాగించారని, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రకటన ఉందన్నారు. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అందరికీ మేలు చేసేలా ఉందని నాగలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ (ఫోటో గ్యాలరీ)

కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 01:52 PM