Share News

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:23 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..
YSRCP and Congress

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడటం.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు పూర్తయింది. వైసీపీ శ్రేణులు మాత్రం చాలాచోట్ల నిరాశలోనే ఉన్నారట. ఓవైపు శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో కొంతమంది నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వాళ్లంతా పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వైసీపీలో కొంతమంది నేతలకు టీడీపీ, జనసేన, బీజేపీలో గేట్లు క్లోజ్ చేశారట. దీంతో తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై తర్జన భర్జన పడుతున్నట్లు పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

Atchannaidu: మత్స్యశాఖను చూస్తే బాధనిపిస్తోంది...


వైసీపీ నేతలకు పిలుపు..

ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంలో ఉండగా.. వైసీపీ విపక్షంగా ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మాత్రం కాంగ్రెస్‌‌కు అనుకూలంగా మారాయనే చర్చ జరుగుతోంది. ఏపీలో తన బలాన్ని పెంచుకోవడానికి ఇదే మంచి అవకాశమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. వైసీపీ క్రమంగా బలహీనపడుతుండటంతో.. ఆపార్టీ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్‌తో అనుబంధం ఉన్న నాయకులు, కాంగ్రెస్ భావజాలంతో ఉన్న నాయకులకు కాంగ్రెస్ ఇప్పటికే కబురు పంపిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని.. కాంగ్రెస్ క్రమంగా బలపడుతుందని.. పార్టీలో చేరాలని కొందరు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను హస్తం పార్టీ నేతలు కోరినట్లు తెలుస్తోంది.

Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు


ప్లాన్ ప్రకారం..

వైసీపీ నేతలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ వైఎస్సార్ జయంతి వేడుకలను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించడంతోపాటు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. వైసీపీ పని అయిపోయిందని.. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ క్యాడర్ ఉత్సాహం నింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు. మరోవైపు ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్‌తో పాటు రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.


Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 10 , 2024 | 07:23 PM