Share News

AP Police: 23మంది అరెస్టు ఎక్కడంటే..?

ABN , Publish Date - May 27 , 2024 | 08:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని విస్తృత తనిఖీలు చేపట్టారు.

AP Police: 23మంది అరెస్టు ఎక్కడంటే..?
AP DGP Harish Kumar Gupta

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికల వేళ మాచర్లలో పెట్రోలు బాంబులు, రాళ్లు, బీరు సీసాలు దొరకడంతో ఈసారి ఎలాంటి ఘర్షణలకూ తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.


తనిఖీల్లో ఏం దొరికాయంటే..

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈనెల 24నుంచి రాష్ట్రవ్యాప్తంగా 502ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వస్తువులు, వాహనాలు గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 2,602సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 23మంది అరెస్టు చేయగా.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 307 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని నాటుసారాకు ఉపయోగించే 93,600లీటర్ల ఊటబెల్లం ధ్వంసం చేశారు. ఒక నాటు తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Elections: అడ్డంగా బుక్కైన మంత్రి కాకాణి.. అసలేం జరిగిందంటే..?

AP Elections: సీఎం జగన్ నీటి ప్రాజెక్టులను అటకెక్కించారు: జనసేన నేత కొణతాల రామకృష్ణ

Updated Date - May 27 , 2024 | 08:30 PM