Share News

Jagan: నడిరోడ్డుపై జరిగిన దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు

ABN , Publish Date - Jul 18 , 2024 | 11:59 AM

Andhrapradesh: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో నడిరోడ్డులో జరిగిన హత్యాకండపై గురువారం ట్విట్టర్ వేదికగా జగన్ స్పందిస్తూ... లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Jagan: నడిరోడ్డుపై జరిగిన దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు
Former CM YS Jaganmohan Reddy

అమరావతి, జూలై 18: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో నడిరోడ్డులో జరిగిన హత్యాకండపై గురువారం ట్విట్టర్ వేదికగా జగన్ స్పందిస్తూ... లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Ganta Srinivasa Rao: గుడివాడ అమర్‌నాథ్‌కు గంటా స్ట్రాంగ్ కౌంటర్..


కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అంటూ విరుచుకుపడ్డారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు.

Somireddy: విజయసాయి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే


దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి మంత్రి అమిత్‌షాకి ఈ సందర్భంగా జగన్ విజ్క్షప్తి చేశారు. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 12:09 PM