Share News

Yarlagadda: చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణం

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:25 PM

Andhrapradesh: క్రైసిస్ మెనేజ్మెంట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు ప్రతిపక్షహెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారన్నారు.

Yarlagadda: చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణం
MLA Yarlagadda Venkatrao

అమరావతి, సెప్టెంబర్ 7: క్రైసిస్ మెనేజ్మెంట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrababu Naidu) వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Gannavaram MLA Yarlagadda Venkatrao) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు ప్రతిపక్షహెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారన్నారు. సింగ్ నగర్ ప్రాంతం వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది పోటీ చేస్తే వారంతా కనపడడం లేదన్నారు.

CM Revanth Reddy: ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్


జలాశయాల విషయంలో తండ్రి ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకువెళ్లలేదని విమర్శించారు. జగన్ బుడమేరు పనులు ఆపేయడం వల్లే విజయవాడకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మంది వైసీపీ వారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వరద వస్తే ఎవ్వరూ రాలేదని.. అలాంటి వారు చంద్రబాబు ఇక్కడే ఉండి సహయక చర్యలు చేస్తుంటే ఆయన్ను విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. విదేశాలకు వెళదామనుకున్న జగన్ ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాలని అలాకాకుండా ఆయన రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు.

Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..


రాజకీయాల్లో పవర్ అనేది పవరే అని... పవర్‌లో ఉన్న వారు పిచ్చివాగుడు వాగడం సరి కాదని.... ఇప్పుడు వచ్చి మాట్లాడమనండి అంటూ సవాల్ విసిరారు. బూతులు తిట్టిన వారు అందరూ ఓడిపోయారన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాషపై దాడి చేశారన్నారు. వైనాట్ 175 అని తరువాత సిద్ధం అని మీద పడిపోయారన్నారు. రాజకీయాల్లో ఉందాం అనుకుంటే ప్రజాస్వమ్యం పరమావదిగా పనిచేయాలని హితవుపలికారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురంలలో పర్యటించాలని మీడియా ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అలా కాకుండా సీఎంను విమర్శిస్తే ప్రజలు కూడా హర్షించరని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Mahesh Kumar Goud: రేవంత్ తర్వాత పీసీసీ కావడం బిగ్ టాస్క్.. తొలిసారి ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్

Kollu Ravindra: పండుగ రోజు కూడా చంద్రబాబు ప్రజలతో ఉన్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 07 , 2024 | 12:35 PM