Anagani: నువ్వా శాంతిభద్రతల గురించి మాట్లాడేది... జగన్‌పై అనగాని ఫైర్
ABN , Publish Date - Oct 23 , 2024 | 04:21 PM
Andhrapradesh: కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. పట్టించుకోని జగన్ శాంతిభద్రతలపై మాట్లాడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 23: ఎన్నికల్లో ఘరోపరాజయంతో పరాభవంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyprad) ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో నోటి కొచ్చిందల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగినన్ని దాడులు ఇంకెప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. వాటిని నిరోధించేందుకు అసలు చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు.
BSNL: రూ.300కే 2 నెలలు.. ఈ రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయిందిగా
తన ఇంటి పక్కనే దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసిన జగన్.. శాంతిభద్రతల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోనే దళిత మహిళ నాగమ్మపై ఆత్యాచారం జరిగితే జగన్ రెడ్డి కనీసం పట్టించుకున్నారా అని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన పాలనలో యువతను గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యానికి అలవాటు చేసి వారిని పెడదారి పట్టించారని విమర్శించారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన మగాళ్లు మహిళలపై దాడులు కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోందని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు జరిగిన ఘటనల్లో వెనువెంటనే పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
జగన్ వ్యాఖ్యలు ఇవే...
ఏపీలో లా అండ్ ఆర్డ్‌ర్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ అయిన సహానా కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. ఒక దళిత చెల్లి బలై పోయిందని విమర్శించారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామని.. దిశ యాప్ అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు. ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులను పంపించే వాళ్ళమన్నారు. చేసిన వాడు మన వాడైతే ఏం చేసినా పర్వాలేదు అన్న సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. గుంటూరులో దయనీయమైన ఘటన జరిగిందని... ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో చూశామన్నారు. సీఎం చంద్రబాబుతో నిందితుడు దిగిన ఫోటోలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ధర్మం పాటించాలన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారని.. ప్రభుత్వం నుంచి ఎవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం టీడీపీకి చెందిన యువకుడు కావడంతోనే ప్రభుత్వం స్పందించ లేదని విమర్శించారు.
రెడ్ బుక్ పాలనలో పోలీసులు నిమగ్నమయ్యారని వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలను అరికట్టలేకపోయారన్నారు. చంద్రబాబు పాలనలోకి వచ్చిన మూడు నెలల్లో 77 మందిపై అత్యాచారాలు జరిగాయని.. ఏడు మంది హత్యకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా అంటూ మండిపడ్డారు. రెడ్ బుక్ పాలనలో ఏమైనా చేయండి వెనకేసుకొస్తామని చంద్రబాబు అంటున్నారన్నారు. ఫోక్సో కోర్టులు, మహిళా కోర్టులు ఏర్పాటు చేశామని.. దిశ వాహనాలను ఇచ్చామని వెల్లడించారు. పథకాలన్నీ ఎత్తి వేశారని.. మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. మహిళలు బ్రతకడానికి ఇబ్బంది పడే స్థితికి తీసుకొచ్చారని అన్నారు. తాము వచ్చిన తర్వాత ఏరి ఏరి నిందితులను పట్టుకుని జైలులో పెట్టిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగిందని ఒప్పుకొని దర్యాప్తు చేయాలన్నారు. ప్రభుత్వం రాజకీయం చేస్తోందని జగన్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..
Cyclone Dana: దానా తుపానుపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News