AP News: కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్: మంత్రి కొలుసు
ABN , Publish Date - Oct 11 , 2024 | 11:53 AM
గత ప్రభుత్వ హయంలో 200 రూపాయలు ఓ పత్రిక కొనుగోలు చేయాలని ఇచ్చారని.. దానిపై విచారణ జరుగుతోందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. అది కూడా పలానా పత్రిక కొనాలని అనధికారికంగా నిర్ధేశించారనే సమాచారం ఉందన్నారు. అందుకే ముందుగా 200 రూపాయలు ఇచ్చే జీవోను రద్దు చేశామని వెల్లడించారు.
అమరావతి: ఐ ఆండ్ పిర్, గృహనిర్మాణ శాఖమంత్రి మంత్రి కొలుసు పార్ధసారధి (Minister Colusu Pardhasaradhi) శుక్రవారం మంచి రోజు కావడంతో ఆయన తన పేషీలోకి ప్రవేశించారు. జగన్ (Jagan) ప్రభుత్వ హయంలో ఐ అండ్ పిఆర్ (I@PR) శాఖ, అడ్వర్టయిజ్‌మెంట్ (Advertisement) విషయంలో అవలంభించిన విధానాన్ని మంత్రి తప్పపట్టారు. గత ప్రభుత్వ హయంలో 200 రూపాయలు ఓ పత్రిక కొనుగోలు చేయాలని ఇచ్చారని.. దానిపై విచారణ జరుగుతోందన్నారు. అది కూడా పలానా పత్రిక కొనాలని అనధికారికంగా నిర్ధేశించారనే సమాచారం ఉందన్నారు. అందుకే ముందుగా 200 రూపాయలు ఇచ్చే జీవోను రద్దు చేశామని వెల్లడించారు. కొన్ని పత్రికలకు అర్హత లేకపోయినా కోట్ల రూపాయలు యాడ్స్ ఇచ్చారని, ఇంకొన్ని పత్రికలు న్యూట్రల్‌గా ఉన్నా యాడ్స్ ఇచ్చి పేమెంట్ చేయలేదని.. చివరకు వారే వెనెక్కి తగ్గేలా నీచమయిన పద్దతిని అవలంభించారని మంత్రి కొలుసు మండిపడ్డారు.
మంత్రి కొలుసు పార్ధ సారధి కామెంట్స్...
తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్‌కు, డిప్యూటీ సిఎం పవన కళ్యాణ్, ప్రధాని మోదీకి మంత్రి కొలుసు పార్ధ సారధి ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వం నుంచి వచ్చిన పరిస్ధితులు చక్కదిద్దాడానికి కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పల ఊబిలో దించేసి.. ఆదాయ వనరులు వచ్చే అవకాశాన్ని, అభివృద్ది చేకుండా చేశారని ఆరోపించారు. యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, ఈ పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచడం, మూడు నెలల బకాయిలను కలిపి రూ.7 వేలు ఇచ్చామని ఈ సందర్బంగా మంత్రి కొలుసు పార్ధ సారధి గుర్తు చేశారు. మంచి నాయకత్వం రాష్ట్రానికి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఫలితాలు తేగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే రోజున 65 లక్షల మందికి పెన్షన్‌ను ప్రభుత్వోద్యోగులకు పంపిణీ చేశారని, గతంలో బకాయిలు ఉన్నాయి కదా .. ఈ ప్రభుత్వానికి భాద్యత లేదు అని భావించ లేదన్నారు. రైతులు ఇబ్బందులు పడోద్దని భావించామని, అందుకే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1600 కోట్లు రైతులకు బకాయిలు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేశామని, పాఠశాలల్లో విద్య బ్రహ్మండంగా చేశాం అని చెప్పారు. కేవలం బిల్డింగ్‌లు, రంగులు, గోడల నిర్మాణం తప్పితే ఏమీ చేయలేదని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
విద్య అంటే భవనాలు, రంగులు కాదని, విజ్జానాన్ని పంచడమని, 16,700 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ కోసం చర్యలు తీసకుంటున్నామని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. అభివృద్దిని అందిపుచ్చుకునేలా యువతి యువకులను సిధ్దం చేయాలని, పౌరుల తలసరి ఆదాయాన్ని, జిడిపిని పెంచాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలను కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటుచేస్తున్నామని, మేము బ్రహ్మండంగా చేశామని గత ప్రభుత్వం చెపుతూ ఆ పేరుపై దోపిడీ చేసిందని ఆరోపించారు. పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దించేసిందని విమర్శించారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి తెచ్చిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో కరెప్షన్ లేదని, గత పాలకులు చెపుతూ కరప్షన్‌ను కేంద్రీకృతం చేశారన్నారు. అత్తారింటికి దారేది తరహలో అంతా తమ ఇంటికే అని వ్యవహరించారని, కరప్షన్‌ను కూడా విప్లవాత్మక పద్దతుల్లో గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు.
హౌసింగ్ పై....
హౌసింగ్ విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారిమల్లించిందని,, పేదలకు అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్ధ సారధి విమర్శించారు. చంద్రబాబు హయంలో రెండున్నర లక్షల యూనిట్లు ఉంటే దాన్ని లక్ష 80 వేలకు చేర్చారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు గృహనిర్మాణంలో 50 వేల నుండి లక్షరూపాయలు అధనంగా ఇచ్చినదాన్ని లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏ పేదవాడు ఇళ్లు లేదని అనకూడదని సిఎం చంద్రబాబు చెప్పారని.. ఆదిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
జర్నలిస్టుల గృహనిర్మాణంపై...
జర్నలిస్టులు రాష్ట్ర అభివృద్దిలో ఘననీయమైన పాత్ర పోషిస్తున్నారని, వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారని, వారికి ఇళ్ల స్థలాలే కాకుండా ఏ విధంగా మేలు చేయాలి అనేది ఆలోచించి రావాలని సిఎం చంద్రబాబు రివ్యూలో చెప్పారని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన హమీలు అన్ని నెరవేర్చుతున్నామని, 2029 కల్లా రాష్ట్ర జిడిపి, ప్రతి పౌరుడి తలసరి ఆదాయం పెంచడానికి కృత నిశ్చయంతో ఉన్నామని, ఎన్నికల హమీలు అన్ని నెరవేర్చడంలో ముందుకు వెళతామని మంత్రి కొలుసు పార్ధ సారధి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..
సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి
విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..
ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News