Share News

Viveka Case: ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:09 PM

Andhrapradesh: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Viveka Case: ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు
Supreme Court issues notice to MP Avinash

న్యూఢిల్లీ, నవంబర్ 19: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (YSRCP MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంలో విచారణ ప్రారంభించారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. ఏమైదంటే..


ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించాడని సునీత తరపు న్యాయవాది సిద్దార్ధలూథ్ర ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని లూథ్రా పేర్కొన్నారు. వెళ్లిన డాక్టర్‌ రెగ్యులర్‌గా వెళ్లే వారా... కాదా అని సీజేఐ ప్రశ్నించింది. డాక్టర్‌ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఆయన రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్‌ కాదని న్యాయవాది తెలిపారు. ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలన్న సునీత తరపు న్యాయవాది కోరారు. అవినాష్‌ రెడ్డి వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్నారని, కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూథ్రా పేర్కొన్నారు. సునీత న్యాయవాది వాదనలను సమర్ధించిన సిజెఐ ధర్మాసనం. ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది. ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 3కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.


అలాగే వివేకానంద హత్య కేసులో సునీతా రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ముగ్గురు ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముగ్గురు కూడా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వివేకా హత్య కేసులో జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టుకు సునీత తరపు న్యాయవాది సిద్దార్ధలూథ్ర వివరించారు. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు కంప్లైంట్‌ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని న్యాయవాది తెలిపారు. హత్య కేసును రూపు మాపాలని ప్రయత్నం చేశారని.. ఆ తర్వాత రక్తపు వాంతులు అని ప్రచారం చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామలన్నింటిని దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారని కోర్టుకు లూథ్రా చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్

YS Sunitha: ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి

Real Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 01:14 PM