Share News

AP Assembly: పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యుల ఆగ్రహం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:08 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్ధరిల్లింది. టీడీపీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Assembly: పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యుల ఆగ్రహం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Meetings) ఐదవరోజు (5th Day) శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం (Question time) కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు (News Papers) ప్రకటనలపై (Advertising) టీడీపీ సభ్యులు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా శాసనసభ దద్ధరిల్లింది. దీనిపై సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) మాట్లాడుతూ.. పత్రికలకు వైసీపీ (YCP) ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక్క సాక్షి పత్రికకే మొత్తం రూ. 420 కోట్ల అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారని, ఒక జీవోను అడ్డుపెట్టుకుని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారని, స్పీకర్‌తో మాట్లాడి హౌస్ కమిటీ వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విజయకుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా సీఎస్, ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని తేలిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సర్కులేషన్ ప్రకారం కూడా అధికారులు వ్యవహరించలేదని, దీనిపై విచారణ చేసి.. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.


నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ..

సమాచార శాఖ ప్రజలు కోసం కాకుండా... జగన్ కోసం పని చేసిందని, ప్రకటనల్లో చంద్రబాబును విమర్శించారని.. ఇటువంటి ధోరణి గతంలో లేదని నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) అన్నారు. సాక్షికి రూ. 390 కోట్లు ఇచ్చారని, అలాగే సర్య్కూ లేషన్ లేని ఇంగ్లీష్ పత్రికలకు కోట్ల రూపాయలు దోచి పెట్టారని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియా ద్వారా ఎన్నికల్లో సర్వే చేయించారని, డిజిటల్ మీడియా ద్వారా వందల కోట్లు దోచి పెట్టారని, సాక్షి ఉద్యోగులను ఇందులో పెట్టారని విమర్శించారు. I డ్రీమ్ అనే చెత్త ఛానల్‌ను తీసుకువచ్చి పదవి కట్టబెట్టారని, దేవేందర్ రెడ్డిని తీసుకువచ్చి చైర్మన్‌ను చేసి దోచి పెట్టారని నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


బెందాలం అశోక్ మాట్లాడుతూ..

కొన్ని అనుకూల మీడియాలను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా జగన్ వ్యవహరించారని, సచివాలయాలకు, వాలంటీర్లకు సాక్షి పేపర్లు కట్టబెట్టడం చేశారని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని బెందాలం అశోక్ (Bendalam Ashok) ఆరోపించారు. దీనిపై వెంటనే హౌస్ కమిటీ వేయాలని.. సొమ్మును రికవరీ చేయాలని ఆయన కోరారు.


శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..

ఐ అండ్ పీఆర్ (I &PR) శాఖ మంత్రిని డిపార్ట్‌మెంట్ తప్పుదోవ పట్టించిందని, సాక్షికి రూ. 292 కోట్లు, ఈనాడుకు రూ.190 కోట్లు, ఆంధ్రక్యోతికి రూ. 21 లక్షల ప్రకటనలు ఇచ్చారని శ్రావణ్ కుమార్ (Shravan Kumar) అన్నారు. ఏబీసీ (ABC) సర్య్కూలేషన్ ప్రకారం చేయలేదని ఆరోపించారు. ఇది పెద్ద కుంభకోణమని...దీనిపై. వెంటనే విచారణ చేయాలని కోరారు. సర్య్కూలేషన్ పెంచుకోవడం కోసం వాలంటీర్లు, సచివాలయం సిబ్బందికి ప్రభుత్వ సొమ్ముతో సాక్షి పత్రిక కొనిపించారని విమర్శించారు. ఈ డబ్బంతా సీఎం ఛానల్, పేపర్‌కు ఇచ్చారన్నారు. ఐదేళ్లు దోచుకున్నారని, కమిషనర్ విజయకుమార్ రెడ్డికి బదిలీ అయిందని, విచారణ పూర్తి అయ్యేవరకు ఆయనను రిలీవ్ చేయకూడదన్నారు. అడిషనల్ కమిషనర్ కస్తూరిపై చర్యలు తీసుకోవాలని, ప్రతి పథకంను నాలుగుగా విభజించి ప్రకటనలు ఇచ్చారన్నారు. జగన్ కోసం, సాక్షి మీడియాకు లాభం చేకూర్చేందుకు ప్రకటనలు ఇలా ఇచ్చారని ఆరోపించారు. జగన్ కుటుంబం అనుచిత లబ్ధి పొందిందన్నారు. అనుచిత లబ్ధి చేకూర్చిన సొమ్మును రికవరీ చేయాలన్నారు.


ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ..

ప్రభుత్వం , పాలకులు మారారని.. అధికారులు మాత్రం మారలేదని అన్నారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని, పక్షపాత ధోరణి లేదని మంత్రి ఎలా చెబుతారని ధూళిపాళ నరేంద్ర (Dhulipala Narendra) అన్నారు. సభను తప్పుదోవ పట్టించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరంపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్‌

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 26 , 2024 | 11:08 AM