Share News

YSRCP:అన్నా.. సారీ.. నీతో ఉండలేను.. జగన్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ నేత..

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:23 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన ఆమె మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా ఆమె వాయిస్ వినిపించడంలేదు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోనూ, అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపించిన వాసిరెడ్డి పద్మ కొంతకాలంగా..

YSRCP:అన్నా.. సారీ.. నీతో ఉండలేను.. జగన్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ నేత..
Vasireddy Padma

వైసీపీకి నేతల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆమె అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన ఆమె మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా ఆమె వాయిస్ వినిపించడంలేదు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోనూ, అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపించిన వాసిరెడ్డి పద్మ కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో సరిపెట్టారని, పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడంలేదంటూ కొద్దిరోజులుగా వాసిరెడ్డి పద్మ అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్ నాయకులంతా వైసీపీని వీడుతున్న క్రమంలో తాజాగా వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేస్తారనే చర్చ జరుగుతోంది. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదంటే వేరే ఏదైనా పార్టీలో చేరతారా అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది.

CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..


ఎన్నికలకు ముందు..

సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను వాసిరెడ్డి పద్మ కోరారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్థాపంతో ఆమె పదవి నుంచి తప్పుకున్నారనే చర్చ జరిగింది. పదవికి రాజీనామా చేసినప్పటికీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె అప్పట్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమె వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Chandrababu : ఏపీని ఆపలేరు!


ప్రజారాజ్యం ద్వారా..

సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు. మీడియాలో పార్టీ గొంతును బలంగా వినిపించేవారు. 2009 ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె వైసీపీలో చేరారు. వైసీపీలోనూ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆమెకు జగన్ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవిని అప్పగించారు. ఎన్నికలకు ముందు పార్టీపై అసంతృప్తితో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

నేవీ చేతికి మరో అణ్వాస్త్రం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 08:23 AM