Share News

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:04 PM

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం..

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?
YSRCP Leaders

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.. ఓ పార్టీ విమర్శలకు మరో పార్టీ కౌంటర్ ఇవ్వడం దేశ వ్యాప్తంగా చూస్తుంటాం. కానీ ఏపీలో మాత్రం 2019 నుంచి 2024 మధ్య వైసీపీ (YSRCP) నేతలు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి.. విపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. తిట్లతో విరుచుకుపడేవారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రజలు కోరుకుంటున్నది తిట్ల పురాణం కాదని.. అభివృద్ధి, సంక్షేమమని వైసీపీ నేతలకు తెలిసొచ్చేలా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. తమకు నచ్చని వ్యక్తులను, నాయకులను లక్ష్యంగా చేసుకుని తిట్టడానికి మిమల్ని చట్టసభలకు పంపలేదని.. ప్రజల భవిష్యత్తును బాగుచేయడానికి పంపితే.. మీరు సర్వనాశనం చేశారని తెలిసేలా ఏపీ ఓటర్లు (Voters) తీర్పు చెప్పారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. తాము భారీ మెజార్టీతో గెలుస్తామని విర్రవీగిన నేతలు పరాజయం పాలయ్యారు. విపక్షాలపై తిట్లతో విరుచుకుపడ్డ నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేసినట్లు భవిష్యత్తులో ఎవరూ పనిచేయవద్దని.. ఆచితూచి వ్యవహరించాలని ఓ సందేశాన్నిచ్చారు ఏపీ ప్రజలు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీలో కొందరు నేతలు సైలెంట్ అయిపోయారట.

CM Chandrababu: అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా


వినిపించని స్వరం..

ప్రధానంగా మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజిని, కొడాలి నాని, గుడివాడ అమర్‌నాధ్, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల ముందు నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, జగన్ సహా ఆపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. అవతలి నుంచి ప్రభుత్వ పనివిధానంపై ఏదైనా అభ్యంతరం తెలియజేస్తే.. విషయంపై మాట్లాడకుండా.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించేవారు. ఎన్నికల తర్వాత ఆ నాయకుల స్వరం వినిపించడం లేదు. ఐదేళ్లపాటు ప్రతిరోజూ మీడియా ముందుకువచ్చి మాట్లాడేవ్యక్తులు గత నెల రోజుల కాలంలో పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. వైసీపీ క్రమంగా బలహీనపడుతుండటంతో.. నోరు మెదిపితే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఆలోచనతోనే కొందరు వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

Payyavula Kesav: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే నా తొలి బాధ్యత


ప్రజలు తిరస్కరించడంతో..

ఈ ఎన్నికల్లో ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా తిరస్కరించడంతోనే నాయకులంతా సైలెంట్ అయిపోయారనే ప్రచారం సైతం జరుగుతోంది. కొందరు నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట.. మరికొందరైతే పూర్తిగా వైసీపీ హైకమాండ్‌కు టచ్‌లోనే లేరట. నియోజకవర్గంలో కనిపించని నేతల్లో కొందరు హైదరాబాద్‌కు జంప్‌ అయితే.. మరికొందరు చెన్నైకు వెళ్లిపోయారట. ఇంకొందరు విదేశాలకు పారిపోయారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నాయకుల స్వరం తగ్గడానికి కారణాలు ఏమిటి.. ఆ పార్టీ వ్యహం పనిచేస్తుందా అనేది తేలాంలంటే మరికొద్ది కోజులు ఆగాల్సిందే.


CM Chandrababu: మళ్లీ నేనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతా...

Minister Durgesh: త్వరలోనే కూరగాయల ధరలు తగ్గిస్తాం...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:08 PM