పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన: ఎమ్మెల్యే దస్తగిరి
ABN , Publish Date - Sep 22 , 2024 | 12:18 AM
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
గూడూరు సెప్టెంబరు 21: పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం గూడూరులో వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజా వేదిక గ్రామ సభకు ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాషా్ట్రన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నార న్నారు. బాలికల వసతి గృహం, విశ్రాంతి భవనం, నగర పంచాయతీ తహసీల్దార్, కార్యాలయాలకు నిఽధుల విడుదల చేయించారన్నారు. కోడుమూరు నుంచి వయా గూడూరు మీదుగా రాజోలి వరకు బస్సు తిరిగెందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మెప్మా అర్బన మార్కెట్‌ను సందర్శించారు. అనంతరం అన్న క్యాంటీనను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురుకుంద రామాం జనేయులు, గజేంద్ర గోపాల్ నాయుడు, పౌలు, దండు సుందరరాజు, దానమన్న, కౌన్సిలర్ కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, మన్ననబాషా, సుమన బాబు, నాగప్పయాదవ్, గుడిపాడు మహేశ్వర రెడ్డి, తెలుగు శ్రీను, చాంద్ బాషా, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.