Share News

AP Politics: పిన్నెల్లి అరాచకం.. రూ.50 కోట్లు ఆస్తులు కబ్జా..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:36 PM

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో వివాదం రాజుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు, ఇతర వెసీపీ నాయకులు పలువురు అక్రమంగా తన ఆస్తులు కబ్జా చేశారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కుమారుడు దుర్గాశ్రీనివాస్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. గతంలో పిన్నెల్లి అనుచరులు తన వ్యాపారాలను టార్గెట్ చేశారన్నారు.

AP Politics: పిన్నెల్లి అరాచకం.. రూ.50 కోట్లు ఆస్తులు కబ్జా..!
Pinnelli Ramakrishna Reddy

గుంటూరు, ఆగస్టు 23: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో వివాదం రాజుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు, ఇతర వెసీపీ నాయకులు పలువురు అక్రమంగా తన ఆస్తులు కబ్జా చేశారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ కృష్ణప్రసాద్ కుమారుడు దుర్గాశ్రీనివాస్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. గతంలో పిన్నెల్లి అనుచరులు తన వ్యాపారాలను టార్గెట్ చేశారన్నారు. పెట్రోల్ బంకును ధ్వంసం చేసి, బంకు మూతపడేటట్లు చేశారని తెలిపారు. దీంతో తనకు ఆర్థికంగా భారీ నష్టం ఏర్పడిందని ఆ లేఖలో ఆరోపించారు.


పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను భయపెట్టి రూ.50 కోట్లు విలువ చేసే ఆస్తులను రూ.10 కోట్లకు అమ్మేలాగా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకు న్నారని తెలిపారు. ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకం తీసుకుని పెట్రోల్ బంకును ఆక్రమించుకున్నారన్నారు. పిన్నెల్లి ఆక్రమంచిన ఆస్తులను తిరిగి తనకు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. లేఖను ముఖ్యమంత్రితో పాటు డీజీపీకి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి, పల్నాడు జిల్లా ఎస్పీకి పంపినట్లు శ్రీనివాస్ తెలిపారు.


ఇదిలాఉంటే.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. పోలింగ్ సమయంలో మాచర్చ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ను ధ్వంసం చేశారు. ఈ కేసు సహా.. మరికొన్ని కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన జైలులో ఉన్నారు. తాజాగా పిన్నెల్లోపై మరో ఆరోపణలు వినిపిస్తున్నారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


Also Read:

ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరం

రైతులకు రుణమాఫీ చేస్తే అభ్యంతరమా..?

ముఖేష్ అంబానీ సోదరుడికి మరో షాక్.. రూ. 25 కోట్ల జరిమానా

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 23 , 2024 | 01:39 PM