Share News

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:19 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది.

AP News: సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్ (ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో 27,279మంది విద్యార్థులకు గానూ 18,842మంది పాసవ్వగా.. 69.07ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి అధికారిక వెబ్‌సైట్ లింకుపై క్లిక్ చేసి చూసుకోవచ్చు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భౌవిష్యత్తుపై దృష్టి పెట్టి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - Jul 01 , 2024 | 07:19 PM