-
-
Home » Andhra Pradesh » Nara Chandrababu and Pawan Kalyan attende for TDP Jana Sena Telugu Jana Vijaya Ketanam Public meeting in Tadepalligudem live Updates psnr
-
TeluguJana Vijaya Ketanam Live Updates: ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మందికి తిప్పలు: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - Feb 28 , 2024 | 05:36 PM
ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ (Telugu Jana Vijaya Ketanam Public meeting) విజయవంతమైంది. టీడీపీ - జనసేన (TDP - Janasena) శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.
Live News & Update
-
2024-02-28T20:15:29+05:30
పవన్‌తో స్నేహం అంటే పవన్ చచ్చేదాక.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా: పవన్ కల్యాణ్
నాతో నడిచే వాళ్లే నా వాళ్లు
ఓడినప్పుడు మీతోనే ఉన్నాను.. గెలిచినప్పుడూ మీతోనే ఉంటాను
ఏమీ చేయకున్నా జగన్‌ను పొగిడే వాళ్లు ఉన్నారు
ఏపీ ప్రజల తరపున వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నా
పొత్తు గెలవాలి.. జగన్ పోవాలి.. వైసీపీ నేలమట్టం అవ్వాలి
పవన్‌కల్యాణ్ అంటే ఏపీ ప్రజల భవిష్యత్
జగన్.. నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్‌కల్యాణ్
-
2024-02-28T20:02:07+05:30
జగన్.. నేనూ తెలుగు మీడియలోనే చదువుకున్నా: పవన్ కల్యాణ్
సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేక పోతున్నా
పవన్‌కల్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్
నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్‌కల్యాణ్
నాతో నడిచే వాళ్లే.. నా వాళ్లు
ఓడినప్పుడు మీతోనే ఉన్నాను.. గెలిచినప్పుడూ మీతోనే ఉంటాను
పవన్‌తో స్నేహం అంటే చచ్చేదాకా.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా
సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేక పోతున్నారు
జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు
వ్యూహాలు రచిస్తాం.. జగన్ కోటలు బద్ధలు కొడతాం
సలహాలు ఇచ్చే వాళ్లు కాదు.. పోరాడేవాళ్లు కావాలి
శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం
-
2024-02-28T19:51:28+05:30
జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా.. మరిచిపోకు: పవన్ కల్యాణ్
జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా.. మరిచిపోకు
టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది
ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను ఎలా లాక్కున్నారు?
రాష్ట్ర లబ్ధి కేసమే ఉంటాయి నా నిర్ణయాలు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నాం
టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది
నడమంత్రపు సిరి వెనుక ఒక నేరం ఉంటుంది
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు
ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు
వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు
మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు..
దాడులు చేస్తే ఊరుకోబోమని పవన్ హెచ్చరిక
ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను ఎలా లాక్కున్నారు?
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం
ఓ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం
25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదు..
యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించేందుకే మా ఆలోచన
ప్రజల భవిష్యత్ కోసం రోడ్లపైకి వచ్చాను
జగన్.. ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు
జగన్ నీ పార్టీని అధఃపాతాళానికి తొక్కకపోతే..
తాడేపల్లి జగన్ కోటను బద్ధలు కొడతాం
-
2024-02-28T19:37:41+05:30
ఏపీ రోడ్లపై పాలు పోస్తే అసలు రంగు బయటపడుతుంది
ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి
ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోంది
ఏదైనా మాట్లాడదామంటే బెదిరింపులు, దాడులు
వైసీపీ రౌడీలకు సభ నుంచి హెచ్చరిక
మా సభలపై కానీ, నాయకులపై కానీ దాడులు చేస్తే సహించం
టీడీపీ, జనసేన నేతల జోలికి వస్తే ఊరుకోబోమని పవన్ హెచ్చరిక
జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా.. మరిచిపోకు
టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది
నడమంత్రపు సిరి వెనుక ఒక నేరం ఉంటుంది
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు
వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు
మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు..
దాడులు చేస్తే ఊరుకోబోమని పవన్ హెచ్చరిక
-
2024-02-28T19:32:17+05:30
సిద్ధం.. సిద్ధం.. అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దాం: పవన్ కల్యాణ్
ఏపీలో అన్ని వ్యవస్థలు, వర్గాలను జగన్ మోసం చేశారు
2024లో మన విజయానికి జెండా ఓ స్ఫూర్తి.. అందుకే జెండా సభ
ఏపీ రోడ్లపై పాలు పోస్తే అసలు రంగు బయటపడుతుంది
పర్వతం వంగి ఎవరికీ సలామ్ చేయదు
గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది
జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేనాని పవన్ కల్యాణ్
-
2024-02-28T19:14:54+05:30
అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం: చంద్రబాబు
ఏపీని సర్వనాశనం చేసేలా సీఎం తీరు ఉంది
తన పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారు
మనందరిపైన ఓ పవిత్రమైన బాధ్యత ఉంది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది.
ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం
అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం
తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం
ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం
జగన్ ఒక బ్లఫ్ మాస్టర్.. అంటే పదేపదే అబద్ధాలు చెప్పడం
చేయని పనులు చేసినట్లు చెప్పుకునే వ్యక్తి జగన్‌రెడ్డి
హూ కిల్డ్ బాబాయ్.. జగన్‌రెడ్డి జవాబు చెప్పాలి
వై నాట్ పులివెందుల అని మేం అంటున్నాం
జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు
సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు
వై నాట్ 175 అని జగన్ అంటున్నాడు..
వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని మేం అంటున్నాం
25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైంది?
మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దు ఏమైంది?
-
2024-02-28T19:10:45+05:30
వైసీపీ దొంగలపై మనం పోరాడుతున్నాం
కొండనైనా బద్ధలు చేస్తామనే ధైర్యం టీడీపీ-జనసేన కూటమి ఇస్తుంది
రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మన లక్ష్యం
టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోంది
టీడీపీ-జనసేన విజయకేతనం జెండా సభ ఇది
ఏపీని వైపీసీ సర్కార్ దోపిడీ చేస్తోంది
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని తరిమికొట్టాలి
నాడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకొచ్చాం
ప్రపంచదేశాలకు వెళ్లి పరిశ్రమలు తీసుకువచ్చాం
రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాం
ఏపీలో సైకో పాలన నడుస్తోంది
త్వరలో రాష్ట్రానికి నవోదయం
భవిష్యత్‌కు నాంది పలకాల్సిన బాధ్యత మనమై ఉంది
ఎన్నిలకు ముందు ముద్దులు పెట్టిన జగన్..
ఎన్నికల తర్వాత జర్నలిస్టులపై పిడిగుద్దులు కురిపించాడు
పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లను మూసివేసిన దుర్మార్గుడు జగన్
సొంత చెల్లితో జగన్‌కు ఆస్తి, ప్యాలెస్ తగాదాలు
తల్లి, చెల్లిపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటే..
జగన్ ఎలాంటి వాడో అందరూ అర్థం చేసుకోవాలి
మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను చంపేశారు
వైసీపీ ఆగడాలకు క్రికెటర్ హనుమవిహరి రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పవన్ స్వచ్ఛందగా ముందుకు వచ్చారు
-
2024-02-28T18:51:45+05:30
సీనియర్ నాయకుడిగా నేను, ప్రశ్నించే నాయకుడిగా పవన్ కల్యాణ్ రాష్ట్రా ఇలా చూస్తూ ఉండలేం
ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు
హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగింది.
2014లో పోటీ కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు.
టీడీపీ-జనసేన సైనికులందరికీ నా ధన్యవాదాలు.
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం
-
2024-02-28T18:45:10+05:30
ఈ రోజు చరిత్ర తిరగరాసే రోజు: చంద్రబాబు
‘‘ఈ రోజు చరిత్ర తిరగరాసే రోజు. క్రమశిక్షణ కలిగిన తెలుగు తమ్ముళ్లు, యువత వైఎస్సార్ కాంగ్రెస్ దొంగలపై యుద్ధం చేయాలి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది’’.
ఈ ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం
అందుకే రెండు పార్టీలు చేతులు కలిపాయి
మాకు అధికారం కోసం కాదు.. రాష్ట్రం కోసం
ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్ కోసం పొత్తు
యువత, పిల్లల భవిష్యత్ కోసం పొత్తు పెట్టుకున్నాం
విధ్వంసమైన రాష్ట్రాన్ని, హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పొత్తుపెట్టుకున్నాం.
మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. మాకు రోశం ఉంది. సత్తా చూపిస్తాం.
-
2024-02-28T18:35:29+05:30
నందమూరి బాలకృష్ణ..
‘‘బడుగుబలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా నిలిచారు అన్న ఎన్టీఆర్. ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా అదే క్రమశిక్షణ కొనసాగించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు ఉనికి లేకుండా చేస్తోంది. కోడిగుడ్డి మీద ఈకలు పీకే బ్యాచ్ ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం చేశారో చర్చిద్దాం.. రండి రారు. ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు’’
-
2024-02-28T18:27:57+05:30
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
తెలుగుదేశ -జనసేన ఏర్పాటు చేసిన పాల్గొన్న అధినేతలు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. సిద్ధమా అని రోడ్డెక్కిన వాడిని ఓడించడానికి మొదలు పెట్టిన యుద్ధంలో తొలి అడుగు ఇది. టీడీపీ శ్రామికుల శ్రమ నుంచి పుట్టిన పార్టీ. జనంలో పుట్టిన జనసేన, టీడీపీ పొత్తు ఈ రాష్ట్రంలో చరిత్రను సృష్టించబోతోంది. కార్మికుల నుంచి పారిశ్రామికుల వరకు అందరూ కోరుకున్న పొత్తు ఇది. రైతులు కోరుకున్న పొత్తు ఇది. రెండు పార్టీలు సమన్వయంతో పనిచేస్తే 160కిపైగా సీట్లు వస్తాయి’’.
-
2024-02-28T18:22:53+05:30
నిమ్మల రామానాయుడు
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ధన్యాగారం. కానీ ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. జగన్ మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక కార్యక్రమాలే ఇందుకు కారణం. అక్వా సబ్సిడీని ఎత్తివేశాడు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. దీనిబట్టి రాష్ట్రాన్ని జగన్ ఎలా భ్రష్టుపట్టించాడో అర్థమవుతోంది. రైతులను ఎందుకు దోపిడీ చేశావ్ జగన్. నీ దోపిడీ మొత్తాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కక్కిస్తాం’’ అని నిమ్మల రామానాయుడు అన్నారు.
-
2024-02-28T18:15:40+05:30
‘తెలుగుజన విజయ కేతనం’ సభలో రఘురామకృష్ణరాజు స్పీచ్
‘‘తెలుగుదేశం, టీడీపీ లేని రాఘురామ ఇక్కడికి ఎందుకొచ్చాడు అనుకుంటున్నారా?. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు నాయకులు ఒక వేదిక మీదకు వచ్చారు. వారికి అభినందనలు తెలియజేడానికి, పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి వచ్చాను. ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడికి వచ్చాను. నేనూ కూటమిలో చేరుతున్నాను. దుర్మార్గుడిని అంతం చేసేందుకు వీరిద్దరూ ఒక్కటయ్యారు. అభినవ కౌరవులు 151 మంది తుదముట్టిస్తారు. నేను నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నాను’’ అని రఘురామకృష్ణ రాజు అన్నారు.
-
2024-02-28T17:54:35+05:30
భారీ భద్రత మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్
ఇరువురు అధినేతల రాకతో సభా ప్రాంగణమంతా హోరెత్తిత్తింది. ఇరు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టాయి.
-
2024-02-28T17:45:16+05:30
ఇరు పార్టీల అధినేతలు ఏమేం ప్రకటనలు చేయబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ.
పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ప్రకటన రావొచ్చంటూ ఊహాగానాలు
-
2024-02-28T17:41:46+05:30
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి 'తెలుగుజన విజయకేతన జెండా ' బహిరంగ సభ కోలాహలం
టీడీపీ - జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు
సభలో పాల్గొనడానికి వచ్చిన కార్యకర్తలు, జనాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి
-
2024-02-28T17:31:54+05:30
ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ (Telugu Jana Vijaya Ketanam Public meeting) భారీ బహిరంగ సభకు టీడీపీ - జనసేన (TDP - Janasena) సంసిద్ధమయ్యాయి. తాడేపల్లిగూడెం వేదికగా జరుగుతున్న ఈ సభకు ఇరుపార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో కదనోత్సహంతో తరలివచ్చాయి. సభాప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది. బహిరంగ సభ ప్రభావంతో తాడేపల్లిగూడెం మొత్తం సందడిగా మారిపోయింది.