Big Shock: నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్..!
ABN , Publish Date - Mar 15 , 2024 | 01:35 PM
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం.
నెల్లూరు: జిల్లాలో వైసీపీ (YCP)కి మరో బిగ్ షాక్ (Big Shock) తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే (Ex MLA) వంటేరు వేణుగోపాల్ రెడ్డి (Vanteru Venugopal Reddy) సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం. 2014, 2019 ఎన్నికల్లో కావలి (Kavali), ఉదయగిరి (Udayagiri) లో వైసీపీ గెలుపు కోసం వంటేరు పనిచేశారు. పదేళ్లుగా పార్టీలో ఉన్నా కనీస గౌరవం దక్కకపోవడంతో మనస్థాపం చెందారు. ఈ క్రమంలో ఎంపీ వేమిరెడ్డి (MP Vemireddy)తో కలిసి తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) సమక్షంలో అనుచరులతో సహా టీడీపీలో చేరనున్నారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో కావలి, ఉదయగిరి వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.