Pinnelli: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. హడావుడిగా మాచర్లకు పయనం
ABN , Publish Date - Aug 24 , 2024 | 10:39 AM
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు.
నెల్లూరు, ఆగస్టు 24: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Former MLA Pinnelli Ramakrishnareddy) నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ జైలు వద్దకి వెళ్లారు.
Hyderabad: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఏంటంటే..
నిన్ననే పిన్నెల్లికి బెయిల్ మంజూరు అయ్యింది. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. పిన్నెల్లి విడుదల నేపథ్యంలో స్థానిక పోలీసులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. నరసరావుపేట పోలీసు బృందాలు నిన్ననే నెల్లూరుకు చేరుకున్నారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మే 13న మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ల ధ్వంసం, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడితోపాటు మే 14న కారంపూడిలో సీఐపై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి నిన్న (ఆగస్టు 23) ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు తిరస్కరించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి
చివరకు శుక్రవారం మధ్యాహ్నం పిన్నెల్లిక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రూ.50 వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు వారానికి ఓసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎ్‌సహెచ్‌వో) ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్‌పోర్టును సంబంధిత మేజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
KTR : కేటీఆర్ వ్యాఖ్యలు.. రాజుకున్న వివాదం.. మహిళ కమిషన్ ముందుకు కేటీఆర్
విశ్వమిత్ర భారత్‌కే ఇరుగు పొరుగు బలిమి
Read Latest AP News And Telugu News