Share News

Minister Dola: విద్యార్థులకు అస్వస్థత... హుటాహుటిన నాయుడుపేటకు మంత్రి డోలా

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:02 AM

Andhrapradesh: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Minister Dola: విద్యార్థులకు అస్వస్థత... హుటాహుటిన నాయుడుపేటకు మంత్రి డోలా
Minister Dola Sri Bala Veeranjaneyaswamy

అమరావతి, జూలై 15: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Minister Dola Sri Bala Veeranjaneyaswamy) హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో( Ambedkar Gurukula School) 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు


విషయం తెలిసిన మంత్రి వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో నేటి పర్యటనలు వాయిదా వేసుకుని మంత్రి హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు. మరోవైపు గత అర్ధరాత్రి అధికారులు కూడా గురుకులానికి చేరుకున్నారు. గురకులాన్ని పరిశీలించిన కలెక్టర్... అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు.


ఇవి కూడా చదవండి..

Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Nita Ambani: మీడియాకు క్షమాపణలు తెలిపిన నీతా అంబానీ.. కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 11:07 AM