Share News

YCP: జగన్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడాలని డిసైడ్ అయిన ఎంపీ !

ABN , Publish Date - Feb 21 , 2024 | 01:13 PM

నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం వేమిరెడ్డి ఉన్నారు. ఆయన సతీమణి వచ్చేసి టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు.

YCP: జగన్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడాలని డిసైడ్ అయిన ఎంపీ !

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైసీపీకి (YSRCP) మరో కోలుకోలేని దెబ్బ తగలడం దాదాపు ఖాయమైంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి అధికార పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది జగన్‌‌కు (CM Jagan Mohan Reddy) గట్టి షాకేననే టాక్ వినిపిస్తోంది. వేమిరెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన సతీమణి ప్రశాంతి టీటీడీలో (TTD) కీలక పదవిలో ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేమిరెడ్డి ఎంపీ పదవితో పాటు జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి రాజీనామా చేయనున్నారు. ప్రశాంతి సైతం తన పదవికి రాజీనామా చేయనున్నారు.

ఇక వేమిరెడ్డి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు, అనుచరులు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అసలే నెల్లూరు జిల్లా (Nellore district)లో వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వేమిరెడ్డి రాజీనామాతో మరింత పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల సమయంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నేడో రేపో వేమిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. అనంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

CM Jagan: రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్

Bandaru Satyanarayana: రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 02:11 PM