Share News

YS Jagan: రెడ్ బుక్‌పై తొలిసారి స్పందించిన వైఎస్ జగన్

ABN , Publish Date - Jul 04 , 2024 | 02:40 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాల్లేవ్. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసొచ్చాక..

YS Jagan: రెడ్ బుక్‌పై తొలిసారి స్పందించిన వైఎస్ జగన్

నెల్లూరు: యువగళం పాదయాత్ర సమయంలో నేటి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ (Lokesh Red Book) సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అక్రమ కేసులు, ఓవరాక్షన్ చేసిన అధికారులు, వైసీపీతో అంటకాగి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నతస్థాయి అధికారుల పేర్లన్నీ ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. జాతీయ మీడియా వేదికగా ఇదే రెడ్‌ బుక్‌పై.. అధికారంలోకి వచ్చాక లోకేష్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు లోకేష్. అయితే.. ఇంతవరకూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాల్లేవ్. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ రెడ్ బుక్‌పై తొలిసారి స్పందించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి వెంటనే ఆపాలన్నారు మాజీ సీఎం.


ధోరణి మారాలి..!

లెక్క జమచేసి ప్రజలు.. చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందర్లోనే ఉన్నాయి. బడులు ప్రారంభమైనా అమ్మ ఒడి ఇవ్వడం లేదు. మంచి పాలన చేసి ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించండి. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. శిశుపాలుని పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు పండుతాయి. కారంపూడి సీఐ నారాయణ స్వామిని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే-14న ఘటన జరిగితే.. మే-23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆరోజు లేదా మరుసటి రోజే కేసు ఎందుకు పెట్టలేదు. ఒక పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే దాడులు జరుగుతున్నాయి. కారంపూడి ఘటన తర్వాత వారం రోజులకు పిన్నెల్లిపై 307 కేసు పెట్టారు. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఎస్సీ కుటుంబం ఇబ్బంది పడింది. డీఎస్పీ అనుమతితో వైసీపీ కార్యకర్తల పరామర్శకు పినెల్లి వెళ్లారు. సీఐ నారాయణ స్వామి కనీసం పిన్నెల్లికి ఎదురుపడలేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం పార్టీ చూడలేదు. దాడులో భయపెట్టి చేసే రాజకీయాలు సరికాదు. చంద్రబాబు ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలి. చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు. ప్రజల వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు. వైఎస్సార్ విగ్రహాలను తగలబెడుతున్నారుఅని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

జగన్ ఇలా మాట్లాడారేంటి..?

Updated Date - Jul 04 , 2024 | 02:45 PM