Share News

Pawan Kalyan : జనసేనాని సూర్యారాధన

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:52 AM

ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు.

Pawan Kalyan : జనసేనాని సూర్యారాధన

  • ప్రజాక్షేమం కోరుతూ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ దీక్షలో భాగంగా సూర్యారాధన చేశారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఆదిత్యుడిని ఆరాధించారు. దీక్షాబద్దులై ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులైన పవన్‌ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవానుడికి పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ ఈ ఆరాధన విశిష్ఠతను పవన్‌కు వివరించారు. కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన జనసేన నేత పి.హరిప్రసాద్‌.. గురువారం మధ్యాహ్నం పార్టీ కార్యలయంలో పవన్‌ను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 04:52 AM