Chirala: మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు
ABN , Publish Date - Jun 23 , 2024 | 09:50 AM
బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం, హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించి..
బాపట్ల జిల్లా: చీరాల మండలం, ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం (Rape), హత్య కేసు (Murder Case)ను పోలీసులు (Police) 48 గంటల్లో చేధించారు. నిందితులను అరెస్టు (Accused Arrest) చేశారు. మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా స్పందించి.. విచారణకు ఆదేశాలిచ్చారు. సిఎం ఆదేశాలతో హోం మంత్రి అనిత (Home Minister Anitha) ఘటనా ప్రాంతానికి వెళ్లి సమీక్షించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు.
కేసును స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తుండడంతో ఉన్నతాధికారులు వేగంగా కదిలారు. ఎస్పీ పర్యవేక్షణలో నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీతో మాట్లాడి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, దాడుల విషయంలో వేగంగా స్పందిచాలని, కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉంటే నేరాలను కట్టడి చేయవచ్చన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలన్నారు. త్వరలో పోలీసుల శాఖను ప్రక్షాళన చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..
8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం
రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?
రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News