Share News

AP NEWS: గీతాంజలి ఆత్మహత్యకు కారణం అదే... ఎస్పీ తుషార్ డూడీ ఏం చెప్పారంటే..?

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:52 PM

సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) అనే మహిళా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గీతాంజలి 7వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారని అన్నారు.

AP NEWS: గీతాంజలి ఆత్మహత్యకు కారణం అదే...  ఎస్పీ తుషార్ డూడీ  ఏం చెప్పారంటే..?

గుంటూరు జిల్లా: సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) అనే మహిళా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గీతాంజలి 7వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారని అన్నారు. మంగళవారం నాడు ఎస్పీ తుషార్ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు. వారి దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగుల ద్వారా మనస్థాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి వన్ టౌన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు. అక్కడ ఎఫ్ఐఆర్ అల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. డిజిటల్ పుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని తెలిపారు. కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని.. ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు.

Updated Date - Mar 12 , 2024 | 10:52 PM