Share News

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

ABN , Publish Date - Aug 28 , 2024 | 08:34 AM

ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది.

Earthquake: శ్రీకాకుళంలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

శ్రీకాకుళం: ఇచ్ఛాపురం(Ichchapuram) పరిసర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉదయం 3:45గంటలకు భూకంపం వచ్చింది. రెండు సెకన్లపాటు కంపించడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలోనుంచి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. కాసేపు ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. భారీస్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 08:36 AM