Share News

Duvvada Srinivas: శ్రీనుతోనే ఉంటా: వాణి

ABN , Publish Date - Aug 17 , 2024 | 08:21 PM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు.

Duvvada Srinivas: శ్రీనుతోనే ఉంటా: వాణి
Duvvada Srinivas And Duvvada Vani

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. భార్యతో సెటిల్ చేసుకొని, విడాకులు తీసుకుంటానని స్పష్టం చేశారు. దాంతో ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరింది.


Duvvada-Vs-Vani.jpg


సద్దుమణగని గొడవ

దువ్వాడ శ్రీనివాస్- వాణి దంపతుల గొడవ ఏ మాత్రం సద్దుమణగడం లేదు. ఏదో ఒక అంశంపై గొడవ జరుగుతూనే ఉంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ దంపతులకు 41 ఏ కింద టెక్కలి పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులపై కూడా వాణి ఘర్షణ వైఖరిని అవలంభించారు. తొలుత శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత తనకు ఇవ్వాలన్నారు. దాంతో పోలీసులు మండలి చైర్మన్‌కు సమాచారం ఇచ్చారు. శ్రీనివాస్ ఎమ్మెల్సీ అయినందున మండలి చైర్మన్ అనుమతితో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మండలి చైర్మన్ అనుమతి ఇవ్వడంతో దువ్వాడ శ్రీనుకు పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులు ఇచ్చే సమయంలో శ్రీనివాస్ లేకపోవడంతో అతని సోదరుడు శ్రీధర్ తీసుకున్నారు.


duvvada.jpg


వాణి కొత్త పల్లవి

దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత వాణి కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి దువ్వాడ శ్రీను ఇంటి వద్దకు వచ్చారు. గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తనకు ఆస్తి అవసరం లేదని మరో డ్రామాకు తెరతీశారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని చెబుతున్నారు. శ్రీను కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పారు. తనకు ఏ ఆస్తి వద్దు, కూతుళ్ల భవిష్యత్‌ను శ్రీను చూసుకుంటే చాలని కొత్త పల్లవి అందుకున్నారు. కానీ వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ ఇష్టపడటం లేదు.

Updated Date - Aug 17 , 2024 | 08:21 PM