TDP: శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేటలో ప్రారంభమైన లోకేష్ శంఖారావం
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:31 AM
శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం ఉదయం నరసన్నపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం ఉదయం నరసన్నపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో నరసన్నపేట పసుపుమయంగా మారింది. యువనేతను కలిసేందుకు పెద్దఎత్తున సభ ప్రాంగణానికి మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నరసన్నపేట టీడీపీ ఇన్‍ఛార్జ్ బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సైకోపాలనకు చరమగీతం పాడేందుకే యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర చేపట్టారని, పార్టీని విజయతీరాలకు నడిపే విజనరీ లీడర్ లోకేష్ అని కొనియాడారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తిచేయలేని దౌర్భాగ్యస్థితిలో ఇక్కడ మంత్రి ఉన్నారని విమర్శించారు. రైతుల కష్టాలు పట్టని పనికిమాలిన సర్కారు వైసీపీ ప్రభుత్వమని, చిల్డ్రన్ పార్కును కబ్జాచేయడానికి కూడా వైసీపీ శ్రేణులు వెనుకాడటం లేదని అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు చంద్రన్న ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని విమర్శించారు. అవినీతిపరులైన పాలకులకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలు సిద్ధంగా ఉండాలని బగ్గు రమణమూర్తి పిలుపిచ్చారు. కాగా నరన్నపేట సభ అనంతరం నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లనున్నారు.