Share News

Vijayanagaram : జామిలో ‘తూర్పు గంగ’ శాసనాలు

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:57 AM

విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.

Vijayanagaram : జామిలో ‘తూర్పు గంగ’ శాసనాలు

  • 900 ఏళ్ల కిందటివంటున్న పురావస్తు శాఖ నిపుణులు

  • త్రిపురాంతకస్వామి సన్నిధిలో వెలుగులోకి..

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ఎ్‌స.కోట రూరల్‌, ఆగస్టు 25: విజయనగరం జిల్లా జామిలో పురాతనమైన రాతి శిలా శాసనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి 900 సంవత్సరాల కిందట తూర్పు గంగ చక్రవర్తి అనంత దేవ వర్మ చెక్కించినవిగా భావిస్తున్నారు.

కళింగ సామ్రాజ్యాన్ని ఏలిన రెండో చోళగంగదేవుడు సందర్శించిన సమయంలో రాసిన రాతి శాసనాలుగా భావిస్తున్నారు. జామిలోని త్రిపురాంతక స్వామి ఆలయ ప్రాంగణంలో ఎప్పటి నుంచో ఈ శాసనాలు ఉన్నాయి.

అయితే... వీటి ప్రాశస్త్యాన్ని ఇప్పుడే గుర్తించారు. కొద్దిరోజుల కిందటే శాసనాలు బయటపడ్డాయి. ఎపిగ్రాఫికల్‌ ఇండియా సొసైటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త వెంకటరాఘవేంద్రవర్మ తన సిబ్బందితో వచ్చి శాసనాలను పరిశీలించారు. తెలుగు, సంస్కృతం భాషల్లో ఉన్న లిపిని అచ్చు తీయించారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.


పాండవులు నడిచిన నేలగా...

జామిలోని త్రిపురాంతక ఆలయంలో భూమిలో నుంచి 174 అడుగుల ఎత్తు వరకు స్వయంభూ శివలింగం ఉంది. ద్వాపరయుగంలో పాండవులు 14 ఏళ్ల అరణ్యవాసం అయ్యాక ఒక ఏడాది అజ్ఞాతవాసం ఇక్కడే గడిపారని చెబుతుంటారు.

Untitled-6 copy.jpg

శ్రీకృష్ణదేవరాయులు ఈ ఆలయాన్ని సందర్శించినట్టు మనుచరిత్ర గ్రంథంలో రాసి ఉంది. శ్రీకృష్ణదేవరాయుల వారి అస్థాన కవి అల్లసాని పెద్దన ఈ త్రిపురాంతకస్వామి గురించి, అజ్ఞాతంలో గడిపిన పాండవుల గురించి వర్ణించారని చెబుతారు.

అప్పటి ఒడిశా రాజు అయిన చోళగంగదేవుడు క్రీ.శ. 1050లో శ్రీత్రిపురాంతకస్వామిని దర్శించుకున్నారని అంటారు. ఇదే విషయాన్ని అప్పటి సామంతరాజులు ఇక్కడి శిలాశాసనం ద్వారా అచ్చువేయించినట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై ఒక దశాబ్దం క్రితం ఆంధ్రా యూనివర్సిటీ పురావస్తుశాఖ పరిశోధనలు చేసింది.

Updated Date - Aug 26 , 2024 | 05:57 AM