Share News

Simhachalam:12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:57 AM

విశాఖ: సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

Simhachalam:12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శనం

విశాఖ: సింహాద్రి అప్పన్న (Simhadri Appanna) గిరి ప్రదర్శనకు (Giri Pradarsana) భక్తులు (Devotees) పోటెత్తారు. ఆషాఢ శుద్ద చతుర్దసినాడు గిరి ప్రదర్శనను ప్రారంభించి పౌర్ణమినాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదర్శన చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు.


గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడూ వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కి.మీ. ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచవద్ద కొబ్బరికాయ కొట్టి 32 కి.మీ. కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.


సింహాద్రి స్వామికి చివర విడత చందనం సమర్పణ

సింహాద్రి అప్పన స్వామికి చివర విడత చందనం సమర్పణ జరిగింది. వరాహ లక్ష్మి నరసింహ స్వామి సుప్రభాతం అనంతరం మూడు మనుగుల శ్రీ గంధాన్ని అర్చక స్వాములు సమర్పించారు.12 మనుగుల శ్రీగంధంలో అప్పన్న స్వామి భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. కాగా 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకుని భక్తులు సింహగిరి చేరుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం సింహగిరి చేరుకుంటున్న భక్తులతో కిటికీటలాడుతోంది. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు.. 32 సార్లు గుడి ప్రదక్షిణ చేస్తున్నారు. గుడి ప్రదక్షణ చేస్తున్న భక్తుల కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా రెండు ర్యాంప్‌లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ

అఖిలపక్ష సమావేశం నేడు..

నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

శాంతి అవినీతిపై ఆరా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 11:00 AM