Share News

Steel Plant: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యక్ష పోరాటం.. షెడ్యూల్ ఇదే

ABN , Publish Date - Aug 14 , 2024 | 11:44 AM

Andhrapradesh: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఈమేరకు బుధవారం షెడ్యూల్‌ను కమిటీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కును మూసివేసే దిశగా చర్యలు ఆగలేదని... స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈనెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

Steel Plant: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యక్ష పోరాటం.. షెడ్యూల్ ఇదే
Visakha Steel Plant

విశాఖపట్నం, ఆగస్టు 14: స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఈమేరకు బుధవారం షెడ్యూల్‌ను కమిటీ ప్రకటించింది. కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా విశాఖ ఉక్కును మూసివేసే దిశగా చర్యలు ఆగలేదని... స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈనెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

KTR: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన?


సెప్టెంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. గంగవరం పోర్ట్‌లో లక్ష టన్నుల రా మెటీరియల్ ఉన్న కేంద్రం దానిని గోడ దాటించే ప్రయత్నం చేయడం లేదన్నారు. దశల వారీగా నిర్వీర్యం చేసి మూసివేయాలని కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తుంటే... విశాఖ ఉక్కు మాత్రం ఉత్పత్తిని తగ్గించి నష్టాలను మూటకట్టుకునేలా యాజమాన్యం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక నష్టాలను కారణంగా చూపించి ప్లాంటును మూసివేయాలన్న ఆలోచనలో భాగంగానే ఈ కుట్రలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇంకా చిక్కుల్లోనే..

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్‌డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప ఎటువంటి సాయం చేస్తారనే విషయం వెల్లడించడం లేదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ ప్లాంటును సందర్శించి 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకూ ఎటువంటి కదలిక లేదు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటు ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. జిందాల్‌ నుంచి రూ.800 కోట్లు, టాటా, సెయిల్‌ నుంచి రూ.900 కోట్లు, స్థానిక ట్రేడర్ల నుంచి రూ.1,300 కోట్లు తీసుకున్న యాజమాన్యం వాటిని పప్పుబెల్లాల్లా వాడేసింది. గత నెలలో రూ.1,590 కోట్ల స్టీల్‌ను విక్రయించారు. వీటిద్వారా రూ.1,300 కోట్లు మాత్రమే వచ్చింది.

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..


మిగిలినవి పాత బకాయిల కింద జమ అయిపోయాయి. ప్రస్తుతం ప్లాంటులో ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలు అడుగంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కోకింగ్‌ కోల్‌ 10వేల టన్నులు మాత్రమే ఉంది. అదీ ఒక్కరోజుకే సరిపోతుంది. బాయిలర్‌ కోల్‌ రెండో రోజులకు, పీసీఐ కోల్‌, హార్డ్‌ అండ్‌ సాఫ్ట్‌ కోల్‌ నిల్వలు బాగా తగ్గిపోయాయి. బ్లాస్ట్‌ ఫర్నేసులకు అవసరమైన డోలమైట్‌ నాలుగు రోజులకు, సైజ్డ్‌ ఓర్‌ ఐదు రోజులకు సరిపడా మాత్రమే ఉండగా, ఐరన్‌ ఓర్‌ లంప్స్‌ పూర్తిగా అయిపోయాయి. ఉక్కు శాఖ మంత్రి వచ్చి వెళ్లిన తరువాత ఉత్పత్తి మరింత తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ఐరన్‌ ఓర్‌ను తగినంత సరఫరా చేయకుండా ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తోంది. మంత్రి కనీసం ఆ మాత్రం మాట సాయం కూడా చేయలేకపోయారనే విమర్శలొస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

Viral News: అత్తగారి ప్రవర్తనతో అల్లుడు షాక్.. భార్యను, కూతురిని ఇటలీ తీసుకెళ్లి ఏం చేశాడంటే..!

Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 11:49 AM