KA paul: మోదీయే మరోసారి ప్రధాని: కేఏ పాల్
ABN , Publish Date - Jun 01 , 2024 | 07:27 PM
దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: దేశంలో నరేంద్ర మోదీ(Narendra Modi) మరోసారి ప్రధాని కానున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Praja Shanti Party President KA Paul) స్పష్టం చేశారు. ఆయన ప్రధాని ఎందుకు అవుతారో జూన్ 4న చెప్తానన్నారు. ఏపీలో మేమంటే మేము గెలుస్తామని వైసీపీ, టీడీపీలు అంటున్నాయని, విశాఖలో అయితే తానే ఎంపీగా గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్(Steel Plant) అమ్మకాన్ని ఆపానని, నాలుగవ ఫెజ్‌లో ఎన్నికలు జరగడానికి కారణం తానేనని చెప్పుకొచ్చారు. అందుకే విశాఖ ప్రజలు తనను ఆదరించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాపులు, క్రిస్టియన్లు, బీసీలు, నిరుద్యోగులందరూ మద్దతు తెలిపినట్లు చెప్పుకొచ్చారు.
ఐ ప్యాక్ సర్వే కూడా పాల్ గెలుస్తుందని చెప్పిందన్నారు. 6నుంచి 8లక్షల ఓట్లు తనకు వస్తాయని, 1.5-3లక్షల మెజారిటీతో గెలుస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు చాలా వరస్ట్‌గా జరిగాయని, ఎలక్షన్ కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. వేల కోట్ల పంపకాలు జరిగాయని, రూ.8వేల కోట్లు పట్టుపడ్డాయని ఆరోపించారు. విశాఖలో స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా లోపాలు ఉన్నాయని, సీసీ టీవీ యాక్సెస్, లైవ్ లింక్ ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏంటో ఆర్వో సహా ఎన్నికల సిబ్బంది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?
AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
AP politics: మాచర్ల అల్లర్ల కేసులో సీఐ నారాయణస్వామిపై వేటు..
Read Latest AP News and Telugu News