Share News

Bonda Uma: జగన్ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారు: బోండా ఉమా

ABN , Publish Date - May 17 , 2024 | 12:41 PM

విశాఖపట్నం: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటికు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం, గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమమహేశ్వరరావు అన్నారు.

Bonda Uma: జగన్  దుర్మార్గపు పాలన అంతం  కావాలని ప్రజలు ఓటు వేశారు: బోండా ఉమా
TDP, Bonda Uma

విశాఖపట్నం: తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమి అధికారంలోకి వస్తుందని 15 సర్వేలు చెప్పాయని, విజయవాడలో సీఎం జగన్ (CM Jagan) ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటికు వచ్చి ఏడవలేక నవ్వుతూ మొత్తం, గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమమహేశ్వరరావు (Bonda Umamaheswararao) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖ (Visakha)లో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తామని ప్రకటించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బావుందని చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలని ప్రజలు ఓటు వేశారని.. జగన్‌కు 13 వ తాదీన బుల్లెట్ దిగిందని, మదించిపోయి ఉండటం వలన తెలియడం లేదన్నారు.


విశాఖలో ప్రమాణస్వీకారం అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana).. సొంత జిల్లా విజయనగరానికి. ఉత్తరాంధ్రాకు ఏం చేశారో చెప్పాలని బోండా ఉమ ప్రశ్నించారు. కౌంటింగ్‌కు వైసీపీ బూత్ ఏజెంట్లు కూడా దొరకడం లేదని స్పష్టమైందన్నారు. రహస్యంగా ఇచ్చిన జీవోల్ని ఈ ఆఫీస్ పేరుతో, నోట్ ఫైల్స్ , ఈ ఫైల్స్ మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారని, దీనిపై చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాకుండా, దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎస్ (CS), డీజీపీ (DGP)పై ఉందన్నారు. నేరస్థుడికి, కొమ్ము కాసిన వారిపై ఎన్నికల కమిషనర్, ఎలాంటి చర్యలు తీసుకుందో చూశారు కదా అని అన్నారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) ఊ అంటే చాలామంది ఫలితాలకు ముందే రావడానికి సిద్ధంగా ఉన్నారని బోండా ఉమ అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వాడైతే జూన్ 4 న ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ద్వారాలు తెలుసుకున్నా.. వచ్చేవాడు ఎవరు లేరని బోండా ఉమమహేశ్వరరావు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..

పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

విధుల్లో చేరిన గంగవరం పోర్ట్ ఉద్యోగులు

పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

బయటపడిన జగన్ నిజస్వరూం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 12:45 PM