Share News

YSRCP: విద్యుత్ చార్జీల పెంపుపై నిలదీసిన మహిళ.. నీళ్లు నమిలిన మాజీ మంత్రి

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:09 PM

Andhrapradesh: విశాఖలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్ చార్జీల పెంపుపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని ఓ మహిళ గట్టిగా నిలదీసింది. జగన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని మండిపడింది. కరెంట్ చార్జీల పెంపుతో పేదలు బతకలేక పోతున్నారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

YSRCP: విద్యుత్ చార్జీల పెంపుపై నిలదీసిన మహిళ.. నీళ్లు నమిలిన మాజీ మంత్రి

విశాఖపట్నం, మార్చి 13: విశాఖలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు (Former Minister Avanti Srinivas) చేదు అనుభవం ఎదురైంది. విద్యుత్ చార్జీల పెంపుపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతిని ఓ మహిళ గట్టిగా నిలదీసింది. జగన్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని మండిపడింది. కరెంట్ చార్జీల పెంపుతో పేదలు బతకలేక పోతున్నారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ హయాంలో కేవలం 300 రూపాయల కరెంట్ బిల్ వస్తే... వైసీపీ హయాంలో రూ.600 బిల్లు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మహిళ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం అవంతి శ్రీనివాసరావు వంతైంది. నిన్న (మంగళవారం) మారికవలసలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి...

AP Highcourt: ఎన్నికలకు వాలంటీర్లను వినియోగించడంపై హైకోర్టులో పిటిషన్

TS News: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా.. కేసీఆర్‌తో ఆరూరి సమావేశం అనంతరం ఏం జరగబోతుంది..?


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 03:09 PM