Share News

AP Politics: బొత్సకు ఎమ్మెల్సీ టికెట్.. జగన్ ప్లాన్ అదేనా..?

ABN , Publish Date - Aug 03 , 2024 | 06:15 PM

విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

AP Politics: బొత్సకు ఎమ్మెల్సీ టికెట్.. జగన్ ప్లాన్ అదేనా..?
YS Jagan

విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. విజయనగరం జిల్లాలో పదవులన్నీ బొత్స కుటుంబానికే కట్టబెట్టారు. బొత్స సత్యనారాయణ ఆశీస్సులు ఉన్నవారికి పోస్టులు దక్కాయి. జగన్ సైతం బొత్సకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయాల్లో సీనియర్ కావడంతో ఆయనకు ప్రయారిటీ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టలేదు. కానీ ప్రస్తుతం ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తీసుకున్న నిర్ణయం ఎవరికి అంతుపట్టడం లేదు. అసలు పక్క జిల్లాకు చెందిన వ్యక్తిని ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ప్లాన్ ఏమిటనే చర్చ పార్టీలోనే జరుగుతుందట.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!


ప్రయారిటీ ఎందుకు..?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు, పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లో సీనియర్ కావడం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. బొత్సకు రాజకీయంగా అనుభవం ఉండటంతో ఆయన సేవలను ఉపయోగించుకునే ఉద్దేశంతో జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం టికెట్ల కేటాయింపులో బొత్స కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మికి విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్‌కు వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే బొత్స పార్టీని వీడితే ఆయనతో పాటు ఉత్తరాంధ్రలో మరికొందరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే అంచనాతో.. బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారనే చర్చ జరుగుతోంది.

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది


వ్యూహం అదేనా..!

విశాఖపట్టణం జిల్లాలోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం వైసీపీకి బలం ఉంది. దీంతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ వైసీపీ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు అధికంగా ఉండటంతో బొత్స సత్యనారాయణను వ్యూహంలో భాగంగా నిలబెట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా గెలిస్తే రానున్న మూడేళ్లు పార్టీలో కొనసాగే అవకాశం ఉంటుందని, బొత్సతో పాటు ఇతర నాయకులు పార్టీ మారకుండా ఉంటారనే ఆలోచనతోనే జగన్ బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణకు విశాఖ జిల్లాలోని ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలుస్తారా లేదా వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది తేలాల్సి ఉంది.


Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest News Telugu

Updated Date - Aug 03 , 2024 | 06:15 PM