Share News

Jagan: తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్‌..

ABN , Publish Date - Oct 24 , 2024 | 01:32 PM

జగన్ మీడియా సమావేశంలో గందరగోళం.. దీంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడాలా.. వద్దా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులపై మండిపడ్డారు. తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్‌.. లేని ప్రతిపక్ష నేత హోదాను ఉన్నట్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్‌ తీరుపై స్థానికులు మండిపడ్డారు.

Jagan: తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్‌..

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YCP Chief) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గురువారం విజయనగరం జిల్లా (Vizianagaram Dist.,) గుర్లలో పర్యటించారు. డయేరియా బాధితులను (Diarrhea victims) పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ప్రజల్లో గందరగోళం చెలరేగింది. దీంతో జగన్ ఎంత సర్ది చెప్పినా వారు వినకపోవడంతో ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడాలా.. వద్దా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులపై మండిపడ్డారు. తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్‌.. లేని ప్రతిపక్ష నేత హోదాను ఉన్నట్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్‌ తీరుపై స్థానికులు మండిపడ్డారు. ఓ దశలో మీడియాతో మాట్లాడకుండా వెనుదిరిగారు.


అయితే స్థానిక వైసీపీ నేతలు సర్ది చెప్పడంతో జగన్ మళ్లీ మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చి గ్రామాలను సస్యశ్యామలంగా తీర్చదిద్దామని.. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు ఒకసారి గమనించాలని జగన్ అన్నారు. ఆ రోజు ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయాలు కనిపించేవని, వివిధ శాఖలకు సంబంధించి పనులు చేయించామన్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కనిపించేదన్నారు. గుర్ల గ్రామంలో డయేరితో 14 మంది చనిపోయారన్న వాస్తవాన్ని కూడా ఈ ప్రభుత్వం అంగీకరించలేని పరిస్థితిలో ఉందని, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని జగన్ విమర్శించారు.

తన తల్లి, చెల్లి ఫోటోలు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రతి ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటాయని జగన్ అన్నారు. గ్రామ స్వరాజ్యం ఎంత పతనమైందో గుర్లను చూస్తే అర్థమవుతుందని, మృతుల సంఖ్యను కూడా దాచిపెడుతున్నారని ఆరోపించారు. గుర్ల మండలంలో డయేరియాతో మొత్తం 14 మంది మృతి చెందారన్నారు. ఒక్కొక్క కుటుంబానికి వైసీపీ తరఫున రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవటానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ చాయ్ షుగర్ ఉన్నవాళ్లు కూడా తాగొచ్చు..

విజయసాయిరెడ్డి కుమార్తె కేసు..

రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు

ఆందోళనలో రేవంత్ రెడ్డి సర్కార్..

ఉగ్రవాదంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 24 , 2024 | 01:34 PM