Fireworks: ఏలూరులో భారీ విస్పోటనం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:31 PM
Andhrapradesh: ఏలూరు జిల్లాలో భారీ విస్పోటనం సంభవించింది. దీపావళి పండుగ వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఏలూరు, అక్టోబర్ 31: దీపావళి పండుగ (Diwali Festival) వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులో (Eluru) బాణాసంచా పేలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బైక్‌పై బాణాసంచాను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. చివరకు బాణాసంచా పేలిందని తెలియడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు
దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుంతోంది. తాజాగా.. ఏలూరులో సుధాకర్ అనే వ్యక్తి బాణాసంచాను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఏలూరు తూర్పువీధి సెంటర్ వద్ద ఒక్కసారిగా ఆయన తీసుకెళ్తున్న బాణాసంచా పేలింది. దాంతో ఒక్కసారిగా పెనువిస్పోటనం సంభవించింది. బాణాసంచాను తీసుకెళ్తున్న సుధాకర్ పేలుడు ధాటికి రెండు ముక్కలయ్యాడు. అలాగే అతని వెనకాల కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. మొత్తం ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. బాణాసంచా పలేడు ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
TTD: సీతానగరం వాసికి టీటీడీ బోర్డులో అవకాశం.. కూటమి పార్టీల హర్షం..
బాణాసంచా కొనుగోలు చేసి తీసుకెళ్తున్న సమయంలో బైక్ ఒక్కసారిగా అక్కడున్న గోతిలో పడింది. ఈ క్రమంలోనే సుధాకర్ తీసుకెళ్తున్న బాణాసంచాలో ఉన్న ఉల్లిపాయ బాంబులు పేలాయని స్థానికులు చెబుతున్నారు. పేలుడు విస్పోటనం కూడా తీవ్రంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పేలుడులో సుధాకర్ శరీరం చిధ్రమైన దృశ్యాలు చూస్తే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. అయితే ఉల్లిపాయ బాంబు వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందా అని ప్రజలు భావించే అవకాశం ఉంది. పెద్దమొత్తంలో ఉల్లిపాయ బాంబులు తీసుకెళ్తుండగానే పేలుడు సంభించిందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి నిప్పులేకుండానే, కేవలం ఒత్తిడితోనే ఉల్లిపాయ బాంబులు పేలడంతో ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి..
Vidadala Rajini: యూట్యూబ్ ఛానల్స్‌పై మాజీ మంత్రి ఫిర్యాదు
AP Govt: టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్
Read Latest AP News And Telugu News